Rahuls First Speech In Lok Sabha : మణిపూర్ లో భారత మాతను చంపారు.. కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్

Rahuls First Speech In Lok Sabha :  పార్లమెంట్ సభ్యత్వం పునరుద్ధరణ అయిన తర్వాత తొలిసారిగా ఇవాళ లోక్ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడారు. కాంగ్రెస్ నేతృత్వంలోని "ఇండియా" కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు.. 

Published By: HashtagU Telugu Desk
Rahul Flying kiss

Rahuls First Speech In Lok Sabha

Rahuls First Speech In Lok Sabha :  పార్లమెంట్ సభ్యత్వం పునరుద్ధరణ అయిన తర్వాత తొలిసారిగా ఇవాళ లోక్ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడారు.

కాంగ్రెస్ నేతృత్వంలోని “ఇండియా” కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు..

Also read : Police Case On Chandrababu  : చంద్రబాబుపై హత్యాయత్నం కేసు.. అంగళ్లు ఘటనలో ఏ1గా చేర్చిన పోలీసులు

మణిపూర్‌ హింసాకాండను రాహుల్ ప్రస్తావిస్తూ..  “మణిపూర్  రాష్ట్రంలో మీరు భారత మాతను చంపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మణిపూర్‌ను భారతదేశంలో భాగంగా చూడటం లేదు.  అందుకే అక్కడికి ఆయన ఇప్పటిదాకా అక్కడికి వెళ్ళలేదు.  అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్ లో భారత సాయుధ బలగాలను, ఆర్మీని  ఎందుకు ఉపయోగించడం లేదో అర్ధం కావడం లేదు. ప్రధాని మోడీ  ద్రోహానికి పాల్పడుతున్నారు..  దేశం పెట్టుకున్న నమ్మకాన్నివమ్ము చేస్తున్నారు..మీరు దేశాన్ని కాపాడలేక పోతున్నారు.. రక్షణ కల్పించలేకపోతున్నారు” అని  విరుచుకుపడ్డారు. “కొద్ది రోజుల క్రితమే  నేను మణిపూర్ కు వెళ్ళొచ్చాను. మన ప్రధాని మోడీ  మాత్రం ఒక్కరోజు  కూడా అక్కడికి  వెళ్లి రావడం లేదు. ఎందుకంటే ఆయన దృష్టిలో మణిపూర్  అంటే భారతదేశం కాదు” అని(Rahuls First Speech In Lok Sabha) మండిపడ్డారు. “ప్రధాని మోడీ  మన దేశ ప్రజల  హృదయ స్పందనను వినడంలేదు. ఆయన ఇద్దరి మాటలు మాత్రమే వింటున్నారు.  రావణాసురుడు మేఘనాథుడు, కుంభకర్ణుడి మాటే వింటాడు. అలానే మోడీ .. అదానీ, అమిత్‌షా మాటలే వింటున్నారు. లంకను రావణుడి అహంకారమే కాల్చింది. దేశంలో మీరు కిరోసిన్‌ చల్లుతున్నారు. మణిపూర్ లో చల్లారు. ఇప్పుడు హరియాణాలో చల్లుతున్నారు” అని రాహుల్ కామెంట్ చేశారు.

మీరు దేశ ద్రోహులు, దేశ ప్రేమికులు కాదు : రాహుల్ 

“మణిపూర్ ఇక ఏమాత్రం మిగిలిలేదు. ఆ రాష్ట్రాన్ని 2 ముక్కలుగా విడగొట్టారు. అక్కడి పునరావాస శిబిరాల్లో మహిళలు, పిల్లలతో మాట్లాడాను. మీకు ఏమి జరిగింది..? అని ఓ మహిళను ప్రశ్నించా.. నా ఒక్కగానొక్క బిడ్డను కళ్లెదుటే కాల్చిచంపారని ఆమె బదులిచ్చింది. చివరికి నా సర్వస్వం వదిలి కట్టుబట్టలతో ఇంటి నుంచి బయలుదేరానని ఆ మహిళ నాకు వివరించింది. మరో సోదరిణి నేను ప్రశ్నించగా.. జరిగింది గుర్తుకు వచ్చి ఆమె వణికిపోవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత స్పృహ కోల్పోయింది. స్పీకర్‌ సర్‌.. వీళ్లు (పాలకులు) మణిపూర్ లో భారతమాతను హత్య చేశారు. మీరు దేశ ద్రోహులు, దేశ ప్రేమికులు కాదు. అందుకే మీ ప్రధాని మణిపూర్ కు వెళ్లడంలేదు. నా తల్లి ఒకరు ఇక్కడ ఉన్నారు.. మరో తల్లిని మణిపూర్ లో చంపారు. భారత సైన్యం ఒక్కరోజులోనే మణిపూర్ లో శాంతి తీసుకురాగలదు. కానీ అలా చేయడం లేదు” అని కేంద్రంపై రాహుల్‌ తీవ్రంగా విరుచుకుపడ్డారు.

Also read : Arey Baith Neeche : కూర్చోకపోయావో తీవ్ర పరిణామాలు.. శివసేన ఎంపీకి కేంద్రమంత్రి వార్నింగ్

నా అహంకారాన్ని భారత్‌ జోడో పాదయాత్ర మాయం చేసింది

భారత్ జోడో పాదయాత్రను రాహుల్ ప్రస్తావిస్తూ.. “చాలామంది నన్ను భారత్ జోడో పాదయాత్రపై ప్రశ్నించారు. తొలుత వారికి ఏమి చెప్పాలో నాకు తెలియలేదు. కానీ యాత్ర మొదలైన కొన్నాళ్లలోనే నాకు విషయం అర్థం కావడం మొదలైంది. దేని కోసం నేను మరణానికి కూడా సిద్ధమో.. దేని కోసం జైళ్లకు వెళ్లడానికి కూడా సిద్ధమో అర్థం కావడం మొదలైంది. కొన్నేళ్ల కిందట నేను రోజూ దాదాపు 10 కిలోమీటర్ల పరిగెత్తేవాడిని. అలాంటిది  భారత్ జోడో పాదయాత్ర కోసం రోజుకు 25 కిలోమీటర్లు నడవడం వెనుక ఏముంది అనుకున్నా.. అప్పట్లో నాలో అహంకారం ఉంది. కానీ  ఆ అహంకారాన్ని భారత్‌ జోడో పాదయాత్ర మాయం చేసింది.  రోజూ ఉదయం 6 నుంచి సాయంత్రం 8 గంటల వరకు వివిధ వర్గాలు చెప్పింది విన్నాను. ఈ యాత్రలో నాకు కష్టాలు చెప్పుకొనేవారి ఆవేదన మాత్రమే వినిపించేది. ఈ దేశాన్ని భూమి, బంగారం, భాషల పేరుతో రకరకాలుగా పిలుస్తుంటారు. కానీ ఈ దేశం ఓ గొంతుక. దానిని వినాలంటే మన మనసులోని అహంకారాన్ని, ద్వేషాన్ని వదిలిపెట్టాలి ” అని  వ్యాఖ్యానించారు.

  Last Updated: 09 Aug 2023, 01:30 PM IST