CM Kejriwal Arrest: సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై రాహుల్ స్టేట్ మెంట్

దేశ రాజధాని ఢిల్లీ సీఎం అరెస్ట్ కావడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యారు. తాజాగా సీఎం అరెస్ట్ కావడంతో ఇండియా కూటమి భగ్గుమంది. తాజాగా రాహుల్ గాంధీ కేజ్రీవాల్ అరెస్ట్ పై స్పందించారు.

CM Kejriwal Arrest: ఈడీ దూకుడుతో ఢిల్లీ లిక్కర్ కుంభకోణం డొంక కదులుతుంది. ఇటీవల తెలంగాణ ఎమ్మెల్సీ కవితను ఈడీ అదుపులోకి తీసుకుంది. తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. దాదాపు 2 గంటల పాటు ఆయనను విచారించి అదుపులోకి తీసుకుంది. దేశ రాజధాని ఢిల్లీ సీఎం అరెస్ట్ కావడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యారు. తాజాగా సీఎం అరెస్ట్ కావడంతో ఇండియా కూటమి భగ్గుమంది. తాజాగా రాహుల్ గాంధీ కేజ్రీవాల్ అరెస్ట్ పై స్పందించారు.

రాహుల్ గాంధీ మాట్లాడుతూ…బీజేపీ పార్టీని ఉద్దేశించి నియంత ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని దుయ్యబట్టారు. మీడియాతో సహా అన్ని సంస్థలను కబ్జా చేసి, పార్టీలను చీల్చడం, కంపెనీల నుంచి డబ్బులు దండుకోవడం, ప్రధాన ప్రతిపక్షాన్ని స్తంభింపజేయడం పైశాచికమన్నారు. ఇవన్నీ కాకా ఇప్పుడు ఎన్నికైన ముఖ్యమంత్రులను అరెస్టులు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి భారత కూటమి తగిన సమాధానం చెబుతుంది అంటూ హెచ్చరించారు రాహుల్ గాంధీ.

అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించడంతో ఈడీ బృందం ఈ రోజు సాయంత్రం అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి చేరుకుంది. సుమారు 2 గంటల విచారణ తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్టు చేసింది. మరోవైపు మద్యం కుంభకోణం కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్టే విధించాలని కోరుతూ న్యాయవాద బృందం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈడీ శుక్రవారం అరవింద్ కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరుపరిచి, కస్టడీని కోరే అవకాశం ఉంది.

Also Read: CM Arvind Kejriwal: సీఎం అరెస్ట్ అయితే రాజీనామా చేయాల్సిందేనా? రాజ్యాంగం ఏమని సూచిస్తుంది?