Site icon HashtagU Telugu

Rahul Gandhi’s Bharat Jodo Nyay Yatra : రాహుల్ కారుపై దాడి..టెన్షన్లో కార్యకర్తలు

Rahul Car

Rahul Car

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడ్ న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra) బిహార్ నుండి ఇటీవలే పశ్చిమ్ బెంగాల్‌లోకి ప్రవేశించింది. షెడ్యూల్‌లో ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం మాల్దాకు చేరకున్న యాత్రలో భద్రతా లోపం కొట్టొచ్చినట్లుగా కనిపించింది. అయితే, ర్యాలీ సందర్భంగా కొందరు దుండగులు రాహుల్ గాంధీ కారుపై దాడికి (Car Vandalized) తెగబడ్డారు. ఈ క్రమంలో అక్కడున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. రాహుల్ వ్యక్తిగత సిబ్బంది తేరుకునే లోపే దాడి జరిగిందని స్థానికులు వెల్లడించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ దాడిలో కారు యొక్క అద్దం పూర్తిగా ధ్వంసమైంది. దాడి అనంతరం రాహుల్ గాంధీతో పాటు పశ్చిమబెంగాల్ కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి కూడా కారులో నుంచి కిందకు దిగారు. అయితే, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మేము ప్రయాణిస్తున్న కారుపై వెనుక నుంచి దాడి చేసినట్లు తెలిపారు. ఇక, ఈ దాడి తర్వాత రాహుల్ గాంధీ కారులోంచి దిగి బస్సులో కూర్చున్నారు. ఇక, ప్రజలను కాంగ్రెస్ నేతలు శాంతింపజేశారు. ఆ తర్వాత తిరిగి ప్రారంభమైన భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రధాన రహదారుల గుండా నెమ్మదిగా సాగుతుంది. కారు పైకప్పుపై నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ రాహుల్ గాంధీ ముందుకు సాగుతున్నారు.

Read Also : Upcoming Cars: భార‌త మార్కెట్లోకి రాబోతున్న కొత్త కార్లు ఇవే..!