Rahul Gandhi: నేను పెళ్లి చేసుకునే అమ్మాయిలో ఆ 2 లక్షణాలు ఉండాలి: రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ (Rahul Gandhi) తనకు కాబోయే భార్యలో 2 లక్షణాలు కోరుకుంటున్నానని చెప్పారు.. గడ్డం ఎందుకు కత్తిరించడం లేదో కూడా వివరించారు.. యూట్యూబ్ ఛానెల్ "కర్లీ టేల్స్‌" కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి ఆయన చాలా విషయాలు పంచుకున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

  • Written By:
  • Publish Date - January 24, 2023 / 02:00 PM IST

రాహుల్ గాంధీ (Rahul Gandhi) తనకు కాబోయే భార్యలో 2 లక్షణాలు కోరుకుంటున్నానని చెప్పారు.. గడ్డం ఎందుకు కత్తిరించడం లేదో కూడా వివరించారు.. యూట్యూబ్ ఛానెల్ “కర్లీ టేల్స్‌” కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి ఆయన చాలా విషయాలు పంచుకున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

అమ్మాయిలో ఈ 2 లక్షణాలు కావాలి..

‘భారత్ జోడో యాత్ర’ దేశంలోని వివిధ రాష్ట్రాల గుండా సాగుతూ రాజస్థాన్‌కు చేరుకుంది. అక్కడున్న రాహుల్ ని యూట్యూబ్ ఛానెల్ కర్లీ టేల్స్‌ ఇంటర్వ్యూ చేసింది. రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘నేను పెళ్లికి వ్యతిరేకం కాదు. నా తల్లిదండ్రులు చాలా మంచి వివాహం చేసుకున్నారు.  ఒకరినొకరు చాలా ప్రేమించు కున్నారు. నాకు కూడా అలాంటి అమ్మాయి కావాలి. అలాంటి అమ్మాయి దొరికినప్పుడల్లా పెళ్లి చేసుకుంటాను.నచ్చిన అమ్మాయి ఎవరని రాహుల్ గాంధీని ప్రశ్నించగా.. ఆ అమ్మాయి ప్రేమగా, తెలివిగా ఉండాలని అన్నారు.

తినడానికి ఇష్టపడేవి..

‘ఇంట్లో మధ్యాహ్న భోజనం కోసం సాధారణ ఆహారాన్ని వండుతారు. కాంటినెంటల్ ఫుడ్ రాత్రిపూట తయారు చేస్తారు. కానీ నేను చాలా నియంత్రణలో తింటాను. ప్రయాణంలో నేను తెలంగాణలో ఉన్నప్పుడు అక్కడ చాలా స్పైసీ ఫుడ్ తిన్నాను. స్పైసీ ఫుడ్ తినడంలో ఇబ్బంది ఏర్పడింది. నేను ఇంట్లో ఉన్నప్పుడు, నేను ఆహారం విషయంలో కఠినంగా ఉంటాను. ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడానికి ఇష్టపడతాను. నేను తరచుగా తీపి పదార్థాలు తినను. కానీ ఐస్ క్రీం తినడానికి ఇష్టపడతాను. నేను ఒకేసారి 2 ఐస్‌క్రీములు తినగలను. పనసపండ్లు, బఠానీలు తినడం నాకు ఇష్టం ఉండదు” అని రాహుల్ చెప్పారు.

Also Read: Raashi Kanna : లైట్ బ్లూ లో మెరిసిపోతున్న రాశి కన్నా

ఉదయం కాఫీ, సాయంత్రం టీ

రాహుల్ గాంధీ ఇంకా మాట్లాడుతూ.. ‘నాన్ వెజ్‌లో చికెన్, సీఫుడ్, మటన్ తినడమంటే నాకు చాలా ఇష్టం. పాత ఢిల్లీలోని పానీ పూరీ , మోతీ మహల్ బటర్ చికెన్ బాగా ఇష్టం. నేను కార్బోహైడ్రేట్లు తినను. రోటీ , అన్నం రెండూ తినను. కానీ నేను రోటీ లేదా అన్నం తినవలసి వస్తే.. రోటీ తింటాను. నాకు ఉదయం కాఫీ, సాయంత్రం టీ తాగడం ఇష్టం. చికెన్ టిక్కా, సీక్ కబాబ్ , ఆమ్లెట్ కూడా తినడానికి ఇష్టపడతాను అని వివరించారు.

అందుకే గడ్డం తీయడం లేదు

“గడ్డం కట్‌ చేసుకోవాలని పార్టీ వాళ్ళు నాతో చెబుతున్నారు.  కానీ ప్రయాణంలో నా గడ్డం , జుట్టు కత్తిరించుకోకూడదని భావిస్తున్నాను. గడ్డంతో కొత్త రూపాన్ని పొందాను కానీ .. ఆహారం తినేటప్పుడు కొంత అసౌకర్యంగా ఉంది” అని రాహుల్ చెప్పారు.

కరాటేలో బ్లాక్ బెల్ట్

“నాకు స్కూబా డైవింగ్ అంటే చాలా ఇష్టం. స్కూబా డైవింగ్ లో శిక్షణ తీసుకున్న వాళ్ళు నీటి అడుగున శ్వాస ఉపకరణం (స్కూబా) లేకుండా కూడా తన శ్వాసను ఎక్కువసేపు బిగ పట్టుకోగలరు. నాకు ఆధునిక జపనీస్ మార్షల్ ఆర్ట్ ఐకిడోలోనూ బ్లాక్ బెల్ట్ ఉంది .నేను కాలేజీ రోజుల నుంచే కొంత శారీరక శ్రమ చేసేవాడిని. అందులో భాగంగానే మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నాను. ప్రయాణంలో కూడా మార్షల్ ఆర్ట్స్ సాధన చేస్తుంటా” అని రాహుల్ వివరించారు.