భారత్ జోడో యాత్ర పాదయాత్ర మహారాష్ట్రలోకి ప్రవేశించింది. యాత్ర ప్రారంభించే ముందు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని గురుద్వారాను రాహుల్ సందర్శించారు. గురునానక్ జయంతి సందర్భంగా తెలంగాణ నుంచి సోమవారం రాత్రి మహారాష్ట్రలో యాత్ర ప్రవేశించిన కొన్ని గంటల తర్వాత గురుద్వారా యాద్గారి బాబా జోరావర్ సింగ్ జీ ఫతే సింగ్ జీని సందర్శించారు. గురుద్వారా వద్ద సామరస్యం, సమానత్వం కోసం ప్రార్థించారని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. మంగళవారం ఉదయం గురుద్వారా నుంచి నాందేడ్‌లోని బిలోలి జిల్లాలోని అత్కాలి వరకు పాదయాత్ర సాగుతుంది. రాత్రి బస కోసం బిలోలిలోని గోదావరి మానార్ షుగర్ ఫ్యాక్టరీ గ్రౌండ్‌లో ఆగాల్సి ఉందని పార్టీ నాయకులు తెలిపారు. నోట్ల రద్దు, వస్తు, సేవా పన్ను అమలు వంటి కేంద్రం తప్పుడు విధానాల వల్ల చిన్న, మధ్యతరహా వ్యాపారాలు నష్టపోయాయని రాహుల్ గాంధీ అన్నారు. రాబోయే 15 రోజుల పాటు మహారాష్ట్రలో ఉన్న సమయంలో, తాను రాష్ట్ర వాణిని వింటానని, ప్రజల బాధలను కూడా వింటానని రాహుల్ తెలిపారు.
Bharat Jodo Yatra : మహారాష్ట్రలోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర… గురుద్వార్‌ని సందర్శించిన రాహుల్

Rahul Gandhi