Site icon HashtagU Telugu

Rahul Gandhi : రాహుల్ గాంధీకి అస్వస్థత.. ‘ఇండియా’ ర్యాలీకి గైర్హాజరు

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన మధ్యప్రదేశ్‌లోని సాత్నాలో జరిగే ఇండియా కూటమి మెగా ర్యాలీకి గైర్హాజరయ్యారు.  ఈవిషయాన్ని సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ప్రకటించారు. రాహుల్‌ అస్వస్థతకు గురికాడంతో ప్రస్తుతం ఢిల్లీ నుంచి బయటకు వెళ్లే పరిస్థితిలో లేరని తెలిపారు. రాహుల్ గాంధీకి బదులుగా..  కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇండియా కూటమి ర్యాలీకి  హాజరవుతారని తెలిపారు. తొలుతగా జార్ఖండ్‌లోని రాంచీలో కాంగ్రెస్ అభ్యర్థి సిద్ధార్థ్ కుష్వాహా తరపున జరిగే ప్రచార సభలో ఖర్గే ప్రసంగిస్తారని, ఆ తర్వాత సాత్నాలో జరిగే సభకు ఖర్గే హాజరవుతారని జైరాం రమేష్ వెల్లడించారు.

We’re now on WhatsApp. Click to Join

ఇండియా కూటమి ఏప్రిల్ 21న సాత్నా వేదికగా “ఉల్గులన్ న్యాయ్ ర్యాలీ”ని నిర్వహించనున్నట్లు ఇంతకుముందు అనౌన్స్ చేసింది. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, లాలూ ప్రసాద్, ఫరూక్ అబ్దుల్లా, అఖిలేష్ యాదవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్, మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పన సహా పలు మిత్రపక్షాల నాయకులు ఇండియా కూటమి ర్యాలీలో పాల్గొననున్నారు. అయితే అనారోగ్యం కారణంగా ఈ ప్రతిష్ఠాత్మక ర్యాలీకి రాహుల్(Rahul Gandhi) హాజరు కాలేకపోతున్నారు. సాత్నాలోని ప్రభాత్ తారా గ్రౌండ్ లో జరిగే ఈ ర్యాలీలో మొత్తం 14 రాజకీయ పార్టీలు పాల్గొననున్నాయి.

Also Read :AP Elections 2024: బీజేపీ అభ్యర్దిగా టీడీపీ నేత..చంద్రబాబు వ్యూహం