Rahul Gandhi : రాహుల్‌ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో ఆకర్షించే ఘటన

  • Written By:
  • Publish Date - February 16, 2024 / 03:03 PM IST

 

Rahul Gandhi’Bharat Jodo Nyay Yatra’: బీహార్‌లోని ససారమ్‌(Sasaram)లో జరుగుతున్న రాహుల్‌గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో ఆకర్షించే ఘటన ఒకటి జరిగింది. బీహార్‌లో చివరి రోజు జరుగుతున్న యాత్రలో రాహుల్(Rahul) జీపులో ప్రయాణిస్తే, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్(Tejaswi Yadav) డ్రైవ్ చేశారు. తేజస్వీ డ్రైవ్ చేస్తుంటే పక్కనే కూర్చున్న రాహుల్ ముచ్చటిస్తున్న వీడియోను తేజస్వీ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. మరో వీడియోలో ఎస్‌యూవీ రూఫ్‌పై కూర్చుని ప్రజలకు అభివాదం చేస్తూ కనిపించారు.

భారత్ జోడో న్యాయ్ యాత్ర(Bharat Jodo Nyay Yatra)లో భాగంగా ససారమ్‌లో తేజస్వీయాదవ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై నిప్పులు చెరిగారు. ‘‘మన ముఖ్యమంత్రి ఎలాంటి వారో మీ అందరికీ తెలుసు. ఆయన ఏ ఒక్కరినీ పట్టించుకోరు. ప్రజలు చెప్పేది వినిపించుకోరు. నేను చచ్చిపోతాను తప్పితే బీజేపీతో చేతులు కలపనని చెప్పడంతో ఆయనతో ఉండాలని నిర్ణయించుకున్నాం. బీజేపీ(bjp)ని ఓడించేందుకు ఎన్ని త్యాగాలైనా చేయాలనుకున్నాం. కానీ మనం పూర్తిగా అలసిపోయిన ముఖ్యమంత్రిని నియమించాం’’ అని విమర్శించారు.

We’re now on WhatsApp. Click to Join.

నేటి మధ్యాహ్నం 3 గంటలకు రాహుల్‌గాంధీ, తేజస్వీ యాదవ్ ఇద్దరూ ఉత్తరప్రదేశ్‌లోని కైమూర్ జిల్లా(Uttar Pradesh Kaimur district)లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అంతకుముందు ఔరంగాబాద్‌ జిల్లాలో జరిగిన ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ ఆందోళన తెలుపుతున్న రైతులకు మద్దతు ప్రకటించారు. దేశం కోసం సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికులతో రైతులను పోల్చారు.

read also :Farmers Protest In Poland: ఐరోపా దేశంలో కూడా రోడ్డెక్కిన రైత‌న్న‌లు.. 500 ట్రాక్టర్లతో 1000 మంది నిరసన..!