Rahul – January 22 : జనవరి 22న (సోమవారం) యావత్ దేశం దృష్టి అయోధ్య రామమందిరం వైపే ఉంటుంది. ఇటువంటి తరుణంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఏం చేయబోతున్నారు ? అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ కీలక ప్రకటన చేశారు. సోమవారం రోజు ఉదయం అస్సాంలోని నాగోన్ జిల్లాలో ఉన్న శ్రీవైష్ణవ పండితుడు శ్రీమంత శంకర్‌దేవ్ జన్మస్థలం బటద్రవ ఠాణ్‌లో రాహుల్ పర్యటిస్తారని వెల్లడించారు. ‘శ్రీమంత శంకర్‌దేవ్ శతాబ్దాల క్రితం జీవించారు. కానీ ఆయన జీవితం ఇప్పటికీ కోట్లాది మందికి ఆదర్శప్రాయంగా నిలుస్తోంది’ అని ఆయన తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
శంకర్‌దేవ్ 1449 సంవత్సరంలో నాగావ్ జిల్లాలో బోర్డోవా సమీపంలోని అలీపుఖురిలో బారో భూయాన్స్ కుటుంబంలో జన్మించారు . బారో భూయాన్లు అస్సాంలో స్వతంత్ర భూస్వాములు. శంకర్‌దేవ్ కాయస్థ హిందూ కులానికి చెందినవారు. తల్లిదండ్రుల పేర్లు కుసుమ్వర్ భూయాన్, సత్యసంధ్యా దేవి. శంకర్‌దేవ్ 7 సంవత్సరాల వయస్సులో ఉండగా మశూచితో తండ్రి చనిపోయారు. ఇక శంకర్ దేవ్ (Rahul – January 22) పుట్టిన వెంటనే అతని తల్లి మరణించింది. దీంతో తన అమ్మమ్మ వద్ద శంకర్‌దేవ్ పెరిగాడు. శంకర్ దేవ్ 12 సంవత్సరాల వయస్సు నుంచే మహేంద్ర కందలికి చెందిన పాఠశాలకు వెళ్లడం ప్రారంభించాడు. టీనేజీ వయసు నాటికే ఆయన వ్యాకరణం, భారతీయ గ్రంథాలను అధ్యయనం చేశారు. యోగాను అభ్యసించారు. శంకర్ దేవ్‌కు పెళ్లయిన మూడు సంవత్సరాల తర్వాత ఒక కుమార్తె జన్మించింది. బిడ్డ జన్మించిన 9 నెలల తర్వాత భార్య చనిపోయింది. భార్య మరణించిన తర్వాత శంకర్ దేవ్‌లో ఉన్న ఆధ్యాత్మిక అభిరుచి మరింత పెరిగింది. దీంతో ఆయన పన్నెండేళ్ల సుదీర్ఘ తీర్థయాత్ర చేశారు. 1481 సంవత్సరంలో 32 ఏళ్ల వయసులో 17 మంది అనుచరులతో కలిసి ఆయన మరోసారి తీర్థయాత్రను మొదలుపెట్టారు. పూరి , మధుర , ద్వారక , బృందావనం , గయ , రామేశ్వరం , అయోధ్య , సీతాకుండ్ సహా భారతదేశంలోని అన్ని వైష్ణవ మతాల ప్రధాన స్థానాలను సందర్శించారు. పూరీలోని జగన్నాథ క్షేత్రంలో చాలా సంవత్సరాలు గడిపారు. అక్కడ ఆయన పూజారులు, సామాన్యులకు బ్రహ్మ పురాణాన్ని చదివి వివరించాడు. 12 సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగొచ్చి.. హరి అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. తన ఇంటి నిర్వహణ బాధ్యతను అల్లుడు హరికి అప్పగించారు. తీర్థయాత్ర సమయంలోనే ఆయన భక్తి ఉద్యమంలో కీలక భాగంగా మారారు.
Also Read: POK Holy Water : పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి అయోధ్య రామయ్యకు ఏం అందిందో తెలుసా?
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర నేటితో ఎనిమిదో రోజుకు చేరుకుంది. మరికాసేపట్లో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి ఈ యాత్ర చేరుకోనుంది. మణిపూర్ నుంచి బయలుదేరిన రాహుల్ యాత్ర నాగాలాండ్, అస్సాంల మీదుగా అరుణాచల్ ప్రదేశ్ కు చేరుకుంది. 6 వేల కిలోమీటర్ల మేర రాహుల్ ఈ భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపట్టనున్నారు. యాత్రకు ప్రతిచోటా మంచి స్పందన లభిస్తుండటంతో ఉత్సాహంగా రాహుల్ మున్ముందకు సాగుతున్నారు. యువకులు, మేధావులు, మహిళలతో సమావేశమై వారి సమస్యలపై చర్చిస్తున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమిని విజయం వైపు నడిపే దిశగా రాహుల్ అడుగులు వేస్తున్నారు. రాహుల్ తొలి విడత చేపట్టిన భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకూ సక్సెస్ కావడంతో రెండో యాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే.