కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) శుక్రవారం (ఏప్రిల్ 21) తన అధికారిక నివాసం (Official Bungalow) 12 తుగ్లక్ లేన్‌ను పూర్తిగా ఖాళీ చేశారు. దాదాపు రెండు దశాబ్దాలుగా రాహుల్ ఈ ఇంట్లోనే ఉంటున్నారు. వర్గాల సమాచారం ప్రకారం.. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నేడు (శనివారం) లోక్‌సభ సెక్రటేరియట్‌కు ఈ నివాసం తాళాలు అందజేయనున్నారు. పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడటంతో రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం గత నెలలో ముగిసింది. ఆ తర్వాత ఆయనకు తొలగింపు నోటీసు వచ్చింది. తల్లి సోనియా గాంధీ అధికారిక నివాసం 10 జనపథ్‌లో రాహుల్ గాంధీ బస చేయనున్నారు. గత కొన్ని రోజులుగా అతని లగేజీని 10 జనపథ్‌కి తరలిస్తున్నారు.
రాహుల్ గాంధీ ఏప్రిల్ 14న బంగ్లా నుండి తన కార్యాలయం, కొన్ని వ్యక్తిగత వస్తువులను తొలగించారు. శుక్రవారం సాయంత్రం గాంధీ బంగ్లా నుండి తన మిగిలిన వస్తువులను తొలగించినట్లు వర్గాలు తెలిపాయి. ఎంపీగా ఉన్న ఆయనకు ఈ బంగ్లా కేటాయించారు. వారి వస్తువులను తీసుకెళ్తున్న ట్రక్కు భవనం నుంచి బయటకు వెళ్లడం కనిపించింది. రాహుల్ గాంధీ తన కార్యాలయానికి స్థలం కోసం వెతుకుతున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Also Read: Former Governor Satya Pal Malik: జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌కు సీబీఐ సమన్లు
‘మోదీ ఇంటిపేరు’కు సంబంధించిన కేసులో చేసిన వ్యాఖ్యలకు గాను కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడికి రెండేళ్ల జైలు శిక్ష పడింది. ఎంపీగా అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఏప్రిల్ 22లోగా ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని అధికారులు కోరారు. మార్చి 23న సూరత్ కోర్టు గాంధీని పరువు నష్టం కేసులో దోషిగా నిర్ధారించింది. అంతేకాకుండా అతనికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత ఆయన ఎంపీగా అనర్హత వేటు పడింది. అతను సూరత్ సెషన్స్ కోర్టులో మేజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వును సవాలు చేశారు. శిక్షను రద్దు చేయమని అతను చేసిన అప్పీల్ ను సూరత్ కోర్ట్ కూడా తిరస్కరించింది.
సెషన్స్ కోర్టు ఆదేశాలను వచ్చే వారం గుజరాత్ హైకోర్టులో సవాలు చేయనున్నట్లు పార్టీ తెలిపింది. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసిన మరుసటి రోజే లోక్‌సభ సచివాలయం ఆయనకు నోటీసు పంపి ఏప్రిల్ 22లోగా బంగ్లాను ఖాళీ చేయాలని కోరింది. రాహుల్ గాంధీ తొలిసారిగా 2004లో ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నుంచి ఎంపీగా ఎన్నికై, 2019లో వాయనాడ్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు.