Lok Sabha Polls : రాయ్‌బరేలీ నుండి రాహుల్…ప్రియాంక కు నో ఛాన్స్ ..!!

ముందుగా రాయ్ బరేలీ స్థానంలో ప్రియాంక గాంధీ బరిలోకి దిగబోతున్నట్లు ప్రచారం జరిగినప్పటికీ ..ఆమెకు మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. ఆమె పోటీ చేద్దామనుకున్న స్థానంలో రాహుల్ కు ఛాన్స్ ఇచ్చారు

Published By: HashtagU Telugu Desk
Priyanka competition in the Lok Sabha elections difficult?.. Is Rahul in Amethi?

Priyanka competition in the Lok Sabha elections difficult?.. Is Rahul in Amethi?

దేశ వ్యాప్తంగా లోక్ సభ (Lok Sabha) ఎన్నికల సమరం నడుస్తుంది. ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ (Congress) , బిజెపి (BJP) సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే రెండు సార్లు అధికారం చేపట్టిన బిజెపి..ముచ్చటగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని బిజెపి చూస్తుంటే..ఆ ఛాన్స్ ఇవ్వకూడదంటూ కాంగ్రెస్ చూస్తుంది. ఇదిలా ఉంటె కాంగ్రెస్ కంచుకోటల్లో ఈసారి గాంధీ కుటుంబం నుండి ఎవరు బరిలోకి దిగుతారనే ఆసక్తి గత కొద్దీ రోజులుగా దేశ వ్యాప్తంగా నెలకొని ఉండగా…ఆ ఆసక్తి తెరదించింది కాంగ్రెస్ అధిష్టానం. గాంధీ కుటుంబానికి పెట్టని కోటలా భావించే రాయ్ బరేలీ (Rae Bareli) లోక్ సభ స్థానం ఒకటి కాగా..అమేథీ (Amethi ) ఈ రెండు స్థానాలకు సంబదించిన అభ్యర్థులను ప్రకటించింది.

We’re now on WhatsApp. Click to Join.

రాయ్ బరేలీ నుండి ప్రతిసారి గాంధీ కుటుంబం నుండి ఎవరొకరు బరిలో నిల్చుని విజయం సాధిస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుండి సోనియా గాంధీ నిల్చుని భారీ విజయం సాధించింది. కానీ ఈసారి ఆరోగ్య రీత్యా లోక్ సభ కు దూరంగా ఉంది. రాజ్యసభ కు ఎన్నికైంది. దీంతో ఈసారి రాయ్ బరేలీ స్థానం నుండి రాహుల్ గాంధీ బరిలోకి దిగబోతున్నారు. అమేఠీ నుంచి గాంధీ కుటుంబ విధేయుడు కిశోరీ లాల్ శర్మ బరిలో దిగనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా వెల్లడించింది.

ముందుగా రాయ్ బరేలీ స్థానంలో ప్రియాంక గాంధీ బరిలోకి దిగబోతున్నట్లు ప్రచారం జరిగినప్పటికీ ..ఆమెకు మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. ఆమె పోటీ చేద్దామనుకున్న స్థానంలో రాహుల్ కు ఛాన్స్ ఇచ్చారు. దీంతో ఈసారి ప్రియాంకా గాంధీ ఈ ఎన్నికల్లో కూడా పోటీ చేయడం లేదని స్పష్టమైంది. రాయ్​బరేలీ, అమేఠీ నియోజకవర్గాల్లో నామినేషన్ల దాఖలుకు శుక్రవారంతో గడువు ముగియనుంది. దీంతో మరికొద్ది గంటల్లో రాహుల్ గాంధీ, కిశోరీ లాల్ శర్మ నామినేషన్లను దాఖలు చేయనున్నారు. ఇక రాహుల్ నామినేషన్ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొనబోతున్నారు.

Read Also : MDH- Everest: భార‌త్‌లో రూట్ మార్చిన మ‌సాలా కంపెనీలు.. రంగంలోకి FSSAI..!

  Last Updated: 03 May 2024, 09:54 AM IST