ఏఐసీసీ తెర‌పైకి మ‌ళ్లీ రాహుల్..త్వ‌ర‌లోనే అధ్యక్ష‌నిగా బాధ్య‌త‌లు?

మ‌రోసారి ఏఐసీసీఅధ్య‌క్ష బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డానికి రాహుల్ ఆలోచిస్తున్నాడు. మ‌హారాష్ట్ర రాజ్య‌స‌భ సీటు ఎంపిక‌, ప‌శ్చిమ బెంగాల్ ఫ‌లితాలు ఆయ‌న మ‌న‌సును మార్చేశాయ‌ని పార్టీలోని అంత‌ర్గ‌త చ‌ర్చ

  • Written By:
  • Publish Date - October 27, 2021 / 04:00 PM IST

మ‌రోసారి ఏఐసీసీఅధ్య‌క్ష బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డానికి రాహుల్ ఆలోచిస్తున్నాడు. మ‌హారాష్ట్ర రాజ్య‌స‌భ సీటు ఎంపిక‌, ప‌శ్చిమ బెంగాల్ ఫ‌లితాలు ఆయ‌న మ‌న‌సును మార్చేశాయ‌ని పార్టీలోని అంత‌ర్గ‌త చ‌ర్చ. బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అథ‌ర్ రంజ‌న్ చౌద‌రిని రోల్ మోడ‌ల్ గా తీసుకోవాల‌ని పార్టీలోని కొన్ని వ‌ర్గాలు రాహుల్ కు నూరిపోస్తున్నార‌ట‌. అంతేకాదు, అధ్యక్షుడి ఎంపిక‌పై ఇంకా ఏఐసీసీలో క్లారీటీ లేక‌పోవ‌డం పార్టీకి న‌ష్టమ‌నే విష‌యాన్ని ఆయ‌న‌కు చాలా మంది వివ‌రిస్తున్నార‌ని తెలిసింది. అందుకే, అధ్యక్ష ప‌ద‌వి గురించి ఆలోచిస్తున్నాన‌ని రాహుల్ చెబుతున్నార‌ట‌. సో..రాబోయే రోజుల్లో రాహుల్ మ‌ళ్లీ అధ్య‌క్షుని బాధ్య‌త‌లు స్వీక‌రించే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయి.

ఇటీవ‌ల జ‌రిగిన కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ స‌మావేశంలో అధ్య‌క్ష ప‌ద‌విపై అంత‌ర్గ‌త చ‌ర్చ జ‌రిగింది. ఆ విష‌యాన్ని ఆల‌స్యంగా చౌద‌రి వెల్ల‌డించాడు. జీ 23లోని కొంద‌రు సంస్థాగ‌త ఎన్నిక‌ల ద్వారా ఏఐసీసీ అధ్య‌క్ష ప‌ద‌విని ఎన్నుకోవాల‌ని సూచించార‌ట‌. ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించాల‌ని డిమాండ్ చేశార‌ని తెలుస్తోంది. ఆ డిమాండ్ మీద గాంధీ కుటుంబ విధేయులు వ్య‌తిరేకించారు. ఆ స‌మ‌యంలో పూర్తికాల‌పు అధ్య‌క్షురాలిగా తానే ఉంటాన‌ని సోనియా చెప్పారు. దాంతో తాత్కాలికంగా వ‌ర్కింగ్ క‌మిటీ స‌మావేశంలో ఆ వాదానికి ఫుల్ స్టాప్ ప‌డింది. కానీ, శాశ్వ‌తంగా ఆ వాదానికి ముగింపు ప‌ల‌కాలంటే ఖ‌చ్చితంగా అధ్య‌క్ష ప‌ద‌వి ఎన్నిక‌లు జ‌ర‌పాలి. లేదంటే, మ‌రోసారి రాహుల్ అధ్యక్షునిగా బాధ్య‌త‌లు స్వీకరించాలి.అప్ప‌టి వ‌ర‌కు జీ 23 నేత‌లు ఏదో ఒక సంద‌ర్భంలో ఇలాంటి వాదాన్ని వినిపిస్తుంటారు.
మ‌హారాష్ట్ర‌లో కాంగ్రెస్‌, శివ‌సేన కూట‌మి ప్ర‌భుత్వం ఉంది. ఆ రాష్ట్రం నుంచి రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్న రాజీవ్ శంక‌ర్ రావు స‌త్వా మ‌ర‌ణించ‌డంతో ఉప ఎన్నిక వ‌చ్చింది. ఆయ‌న రాహుల్ కోట‌రీలోని మ‌నిషిగా గుర్తింపు ఉంది. స‌త్వా వార‌స‌త్వంగా ఆయ‌న స‌తీమ‌ణి పాండ్యా కోరిక మేర‌కు తొలి నుంచి కాంగ్రెస్ లో ఉన్న రంజ‌‌న్ పాటిల్ కు కాంగ్రెస్ నామినేట్ చేయాలని భావించింది. కానీ, చివ‌రి నిమిషంలో రంజ‌న్ పాటిల్ పేరు బ‌దులుగా పాండ్యా స‌త్వా పేరు గ‌వ‌ర్న‌ర్‌కు వెళ్లిన జాబితాలో మారిపోయింది. సోనియా, రాహుల్ వ‌ర్గాలు కాంగ్రెస్ విడిపోవ‌డం వ‌ల్ల‌నే ఇలా జ‌రిగింద‌ని మ‌హారాష్ట్ర‌లో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న నిద‌ర్శ‌నంగా నిలుస్తోంది.


ఏక‌నాయ‌క‌త్వం పార్టీకి ఉండాల‌ని బెంగాల్ పీసీపీ చీఫ్ చౌద‌రి అంటున్నారు. ఇటీవ‌ల జరిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఘోరంగా అక్క‌డ ఓడిన‌ప్ప‌టికీ ఎలాంటి అధికార మార్పిడి కాంగ్రెస్‌లో జ‌ర‌గ‌లేదు. ప్ర‌తి ఐదేళ్ల‌కు ఒక‌సారి వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపుఓట‌ములు మారిపోతుంటాయి. వాటి ఆధారంగా నాయ‌క‌త్వం మారితే పార్టీకి న‌ష్టమ‌ని చౌద‌రి భావిస్తున్నారు. ఇదే ఈక్వేష‌న్ ను రాహుల్ కు కూడా చెబుతున్నారు. అందుకే, ఓట‌ముల‌కు బాధ్య‌త వ‌హించి పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేసిన రాహుల్ మ‌ళ్లీ స్వీక‌రించాల‌ని కోరుతున్నాడు. అప్పుడే జీ 23 నోళ్లకు తాళం వేయ‌డంతో పాటు కాంగ్రెస్ బ‌ల‌ప‌డుతుంద‌ని అంచ‌నా వేస్తున్నాడు. ఇటీవ‌ల ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో జ‌రిగిన రైతు హ‌త్య‌ల‌పై గాంధీ కుటుంబం పోరాడింద‌ని కొన‌యాడారు. అందుకే, బీజేపీ మంత్రి కుమారుడ్ని అరెస్ట్ చేయించ‌గ‌లిగామ‌ని చౌద‌రి అభిప్రాయ‌ప‌డుతున్నాడు. రాబోయే రోజుల్లో ప్ర‌జ‌ల ప్ర‌క్షాన నిల‌వ‌డానికి రాహుల్ మ‌రోసారి అధ్యక్ష బాధ్య‌త‌ల‌ను స్వీకరించాల‌ని కాంగ్రెస్‌లోని ఒక వ‌ర్గం బ‌లంగా కోరుతుంది. మ‌రి, రాహుల్ మ‌న‌సు మార్చుకుని భ‌విష్య‌త్ లో ఏమి చేస్తుడో..చూద్దాం.