కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షునిగా పగ్గాలు కొత్త వాళ్లకు అప్పగించడానికి సిద్ధం అవుతోంది. ఈ ఏడాది ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నెలల్లో కొత్త అధ్యక్షుడ్ని ఎన్నుకోవడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఆ మేరకు సోనియా గాంధీ జీ 23 లీడర్ల మీటింగ్ లో ప్రకటించింది. జీ 23 లీడర్లలో ఉన్న ఆనంద్ శర్మ, మనీష్ తివారీ, వివేక్ తన్కా లు మంగళవారం సోనియాను కలిశారు. ఏఐసీసీ సంస్థాగత మార్పుల గురించి జీ 23 నేతలు ఆమెతో ప్రస్తావించారు.కాంగ్రెస్ పార్టీలో సమన్వయం లోపించిన విషయాన్ని జీ 23 నేతలు సోనియా దృష్టికి తీసుకెళ్లారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తరువాత పార్టీ పరిస్థితిపై సమీక్షించారు. రాబోవు రోజుల్లోనైనా సమన్వయంతో పనిచేసేలా మార్పులు తీసుకురావాలని సూచించారు. ప్రస్తుతం ప్రధాన కార్యదర్శులుగా ఉన్న రణదీప్ సుర్జీవాలా, అజయ్ మకెన్, కేసీ వేణుగోపాల్ పనితీరుపై జీ 23 నేతలు అసంతృప్తి వ్యక్త పరిచారు. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమికి ప్రధాన కార్యదర్శులు బాధ్యత వహించాలని సూచించారు.
ప్రధాన కార్యదర్శుల వైఫల్యాలు కాంగ్రెస్ పార్టీపై పడుతుందని జీ 23 నేతలు అభిప్రాయపడ్డారు. అదే విషయాన్ని సోనియాకు వద్ద ప్రస్తావించారు. సంస్థాగత నిర్మాణం ఆయా రాష్ట్రాల్లో ప్రధాన కార్యదర్శులు చూస్తున్నారు. పీసీసీల నియామకం విషయంలోనూ వాళ్లే కీలక నిర్ణేతలుగా మారారు. ఫలితంగా పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పతనం అయింది. ఇదే విషయాన్ని జీ 23 నేతులు సోనియా ఎదుట ప్రస్తావించారు. ఇలాంటి తప్పులు దొర్లకుండా ఉండాలంటే ఏఐసీసీ అధ్యక్షుడు కీలకంగా ఉండాలని సూచించారు. సంస్థాగత భారీ మార్పులన్నీ ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో ఏ ఐసీసీ అధ్యక్షునిగా ఎంపిక తరువాత ఉంటాయని సోనియా సూచించారట. ఆ మేరకు జీ 23 నేతలు మీడియాకు వెల్లడించారు. సో..రాహుల్ కు మరో నాలుగు నెలల్లో కాంగ్రెస్ పగ్గాలు అప్పగించడానికి సోనియా సిద్ధం అయిందని ఢిల్లీ వర్గాల టాక్.
Rahul Gandhi : రాహుల్ కు మళ్లీ పట్టాభిషేకం..?
