Rahul Gandhi : గుడిలోకి వెళ్లకుండా రాహుల్‌ ను అడ్డుకున్న ఆలయ సిబ్బంది

  • Written By:
  • Publish Date - January 22, 2024 / 03:58 PM IST

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రస్తుతం భారత్‌ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra) చేస్తున్నాడు. ఈ యాత్రలో భాగంగా అసోం (Assam)లో పర్యటిస్తున్న ఆయనకు చేదు అనుభవం ఎదురైంది.

బటాద్రవ థాన్(సత్రం) (Sri Sri Sankar Dev Satra temple) ఆలయ దర్శనానికి వెళ్లిన రాహుల్‌ గాంధీని.. ఆలయ అధికారులు లోపలికి అనుమతించలేదు. దీంతో ఆయన వాగ్వాదానికి దిగారు. ”మేం ఆలయాన్ని దర్శించుకోవాలనుకుంటున్నాం. నేనేం నేరం చేశా? ఎందుకు ఆలయంలోకి అనుమతించడం లేదు?.. మేం సమస్యల్ని సృష్టించడానికి రాలేదు. కేవలం పూజలు చేసి వెళ్తాం. ఆలయంలో ఎవరు ప్రవేశించాలో కూడా ప్రధాని మోదీనే నిర్ణయిస్తారా ఏంటి? అంటూ అధికారులను నిలదీశారాయన. ఆ ఘటన తర్వాత నాగోవ్‌లో స్థానిక నేతలు, కార్యకర్తలతో బైఠాయింపు నిరసన చేపట్టారాయన.

We’re now on WhatsApp. Click to Join.

ఈ ఆలయాన్ని సందర్శించడానికి అనుమతి ఇవ్వాలంటూ రెండు రోజుల కిందటే అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు అక్కడి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేశారు. ఇప్పటివరకు కూడా అనుమతులు లభించలేదు. మధ్యాహ్నం 3 గంటల తరువాతే అనుమతి ఉంటుందనీ తెలిపారు. ఆలయాన్ని సందర్శించాలనే ఉద్దేశంతో నాగౌన్‌కు చేరిన రాహుల్ గాంధీ, ఇతర నేతలకు పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. పోలీసుల తీరును నిరసిస్తూ రాహుల్ గాంధీ రోడ్డుబై బైఠాయించారు. ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శులు జైరామ్ రమేష్, కేసీ వేణుగోపాల్, ఇతర నాయకులు ఆయనతో పాటు రోడ్డుపై కూర్చున్నారు. అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ముగిసిన తరువాతే భతద్రవ థాన్ ఆలయాన్ని సందర్శించడానికి అనుమతి ఇవ్వాలంటూ తమకు ఆదేశాలు ఉన్నాయని పోలీసులు వివరించారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను తాము పాటిస్తోన్నామని స్పష్టం చేశారు.

Read Also : Janhvi Kapoor: బాలీవుడ్ బ్యూటీ పాటలకే పరిమితమా, జాన్వీ పాత్రపై గుసగుసలు