Site icon HashtagU Telugu

Rahul Gandhi : ఇకపై ఆయనతో సుదీర్ఘ చర్చలను కోల్పోతా : రాహుల్ గాంధీ

Rahul Gandhi shocked by Yechury death

Rahul Gandhi shocked by Yechury death

Rahul Gandhi shocked by Yechury death: సీపీఐ(ఎం) ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి మరణం పట్ల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన తనకు మంచి మిత్రుడు, ఆప్తుడన్నారు. ఇకపై ఏచూరితో సుదీర్ఘ చర్చలను కోల్పోతానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఏచూరి మన దేశం పట్ల లోతైన అవగాహన ఉన్న నేత ‘ఐడియా ఆఫ్ ఇండియా’కు రక్షకుడిగా పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో ఏచూరి కుటుంబ సభ్యులు, స్నేహితులు, అనుచరులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, కొన్నాళ్లుగా ఏచూరి శ్వాస‌కోస స‌మ‌స్య‌తో బాధపడుతూ.. ఢిల్లీ ఎయిమ్స్‌ లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం మరింత విషమమం అయ్యి..గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.

Read Also: PM Modi : పారాలింపిక్స్‌ విజేతలతో ప్రధాని మోడీ సమావేశం

భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కమ్యూనిస్టు ఉద్యమంలో చెరగని ముద్ర వేసుకున్నారు. విద్యార్థి ఉద్యమం నుంచి నాయకత్వ స్థానంలోకి వచ్చిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి జాతీయస్థాయి నాయకుడిగా ఎదిగారు. 1974లో ఎస్ఎఫ్ఐ చేరారు. 1975లో సిపిఎం ప్రాధమిక సభ్యుత్వంను తీసుకున్నారు. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. 1985లో పన్నెండవ పార్టీ కాంగ్రెస్ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. పి సుందరయ్య, ఇఎంఎస్, బిటిఆర్, హరికిషన్ సింగ్ సూర్జిత్, బసవ పున్నయ్య మరియు జ్యోతిబసు వంటి సీనియర్ నాయకులతో కలిసి పనిచేశారు. 1992లో జరిగిన 14వ పార్టీ కాంగ్రెస్ సెషన్‌తో పొలిట్‌బ్యూరోకు చేరుకున్నారు.

Read Also:Peacock Feather: నెమలి ఈకతో ఏకంగా అన్ని దోషాలను తొలగించుకోవచ్చా?