Rahul Gandhi: రేపు రాయ్‌బరేలీలో ఓటర్లకు రాహుల్ థ్యాంక్స్ మీట్

కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా రేపు మంగళవారం రాయ్‌బరేలీలో పర్యటించనున్నారు. ఓటేసిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపేందుకు రాహుల్, ప్రియాంక ఈ కార్యక్రమం చేపడుతున్నారు.

Rahul Gandhi: కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా రేపు మంగళవారం రాయ్‌బరేలీలో పర్యటించనున్నారు. ఓటేసిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపేందుకు రాహుల్, ప్రియాంక ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని ముందుగా అమేథీలో నిర్వహించాలని భావించగా, తర్వాత దానిని రాయ్‌బరేలీగా మార్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపేందుకు మంగళవారం రాయ్‌బరేలీలోని భూమావు గెస్ట్ హౌస్ కాంప్లెక్స్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ అమేథీ జిల్లా విభాగం చీఫ్ ప్రదీప్ సింఘాల్ తెలిపారు. ఎండ వేడిమిని నివారించేందుకు కార్యక్రమ వేదికను మార్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు అమేథీ నుంచి కొత్తగా ఎన్నికైన ఎంపీ కిశోరి లాల్ శర్మ కూడా హాజరవుతారని సింఘాల్ తెలిపారు.

లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ స్థానంలో యూపీ మంత్రి దినేష్ ప్రతాప్ సింగ్‌పై రాహుల్ గాంధీ విజయం సాధించగా, మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీ లాల్ శర్మ అమేథీ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. రాహుల్ గాంధీ దినేష్ ప్రతాప్ సింగ్‌పై నాలుగు లక్షలకు పైగా ఓట్లతో విజయం సాధించారు.

Also Read: Vishnu Priya : రెట్రో లుక్‌లో విష్ణు ప్రియ మామూలుగా లేదుగా..!