దేశాన్ని ఐక్యంగా నిలిపే శక్తి కాంగ్రెస్ పార్టీదేనని, దేశం విడిపోతుందనేదే అంటే కాంగ్రెస్ మాత్రమే ఆపగలిగేదని రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. ఢిల్లీలోని AICC కొత్త ఆఫీసు ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ..RSS చీఫ్ మోహన్ భాగవత్ (Mohan Bhagwat) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసారు. భాగవత్ “రామ మందిర ప్రతిష్ఠాపన రోజే నిజమైన స్వాతంత్ర్యం వచ్చింది” అని పేర్కొన్న నేపథ్యంలో రాహుల్ గాంధీ మండిపడుతూ.. స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన చరిత్రను కించపరిచేలా భాగవత్ వ్యాఖ్యలు చేసినట్లు అన్నారు. ఆయన జాతీయ జెండాకు నమస్కరించని వ్యక్తులు, దేశం గురించి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు.
Krishna River Water : కృష్ణా జలాల విషయంలో మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
దేశానికి స్వాతంత్ర్యం 1947లో రాలేదని, రామ్ మందిర్ నిర్మాణం జరిగినప్పుడే వచ్చిందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అనడంపై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో రెండు భావజాలాలు ఉన్నాయి. అందులో ఒకటి రాజ్యాంగబద్ధమైన భావజాలం కాంగ్రెస్ పార్టీది. మరొకటి ఆర్ఎస్ఎస్ భావజాలం. మా భావజాలంలో పెద్ద, చిన్న కులాలు, తరతమ బేధాలు ఉండవు. రాజ్యాంగంలో అదే రాసి ఉంది. ఆర్ఎస్ఎస్ లో పూర్తిగా కేంద్రీకృతమైన విధానాలు, నిర్ణయాలు ఉంటాయి. మోహన్ భగవత్ రాజ్యాంగం చెల్లుబాటు కాదని చెబుతున్నారు. బ్రిటీష్ వారి మీద జరిగిన పోరాటాన్ని గుర్తించడం లేదు. వారికి త్రివర్ణ పతాకంపై గౌరవం లేదు. వారికి రాజ్యాంగ విలువలపై నమ్మకం లేదంటూ రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని కాపాడే ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అధి కాంగ్రెస్ పార్టీయేనని రాహుల్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ భావజాలం ఇవాళ్టిదో నిన్నటిదో కాదు. వేల సంవత్సరాల ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని వ్యతిరేకిస్తూ వేల ఏళ్లుగా మా ఐడియాలజీ కొనసాగుతూ వచ్చింది. గురునానక్, గౌతమ బుద్ధుడు, కృష్ణుడు.. వీళ్లంతా ఆర్ఎస్ఎస్ ఐడియాలజీనా.. అంటూ రాహుల్ ప్రశ్నించారు. ఈ కొత్త భవనం కాంగ్రెస్ భావజాలానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ భవనంలో ఉన్న అందరూ ఆ భావజాలాన్ని కాపాడేవారే. వీరెవరూ బీజేపీకి లొంగిపోయేవారు కాదు. ఈ భవనం బయట మిలియన్ల కొద్దీ ప్రజలు మన భావజాలానికి మద్దతుగా ఉన్నారు. ఈ భావజాలం దేశం నలుమూలలకు మరింతగా విస్తరించాలని రాహుల్ గాంధీ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.