Rahul Gandhi: పెళ్లిపై స్పందించిన రాహుల్ గాంధీ.. అలాంటి అమ్మాయి అయితే ఓకే..!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన వివాహం విషయమై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు కాబోయే భార్యకు ఉండాల్సిన లక్షణాల గురించి వెల్లడించారు.

Published By: HashtagU Telugu Desk
Rahul Gandhi wedding bride

Rahul Gandhi wedding bride

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన వివాహం విషయమై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు కాబోయే భార్యకు ఉండాల్సిన లక్షణాల గురించి వెల్లడించారు. తన నాయనమ్మ ఇందిరా గాంధీ, తల్లి సోనియా గాంధీ లాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్న జీవితభాగస్వామిని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇంటర్వ్యూలో పెళ్లిపై ప్రశ్నించగా.. తన తల్లి సోనియా గాంధీ, నాయనమ్మ ఇందిరా గాంధీ గుణాలు కలగలిసిన భాగస్వామితో జీవితంలో స్థిరపడేందుకు ఇష్టపడతానని తెలిపారు. నాయనమ్మ ఇందిరా గాంధీని తన రెండో తల్లి అని రాహుల్‌ అన్నారు. ఆమె లాంటి మహిళ దొరికితే జీవితంలో స్థిరపడతారా అని అడగగా ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. అలాంటి లక్షణాలు ఉన్న మహిళకు ప్రాధాన్యం ఇస్తాను. నా తల్లి, నాయనమ్మల గుణాలు ఉంటే మంచిదని రాహుల్‌ తెలిపారు.

Also Read: Delhi : ఢిల్లీలో న్యాయ‌వాది ఇంట్లో చోరికి పాల్ప‌డిన వ్య‌క్తి అరెస్ట్.. భారీగా బంగారం స్వాధీనం

  Last Updated: 29 Dec 2022, 09:59 AM IST