Site icon HashtagU Telugu

Rahul Gandhi : సిక్కు వ్యతిరేక అల్లర్లపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

Rahul Gandhi Comment On Anti Sikh Riots Operation Blue Star Congress Indira Gandhi

Rahul Gandhi : పంజాబ్‌లోని అమ్రిత్‌సర్‌లో ఉన్న స్వర్ణ దేవాలయాన్ని సిక్కులు పరమ పవిత్రమైందిగా భావిస్తారు. దానిలోకి ప్రవేశించి భారత ఆర్మీ 1984 జూన్ 1న ఆపరేషన్ బ్లూ స్టార్‌ను నిర్వహించింది. అందులో దాక్కున్న ఖలిస్తానీ మిలిటెంట్లను ఏరిపారేసింది. ఈ ఘటన జరిగిన సరిగ్గా నాలుగు నెలల తర్వాత 1984 అక్టోబరు 31న ఉదయం 9.30 గంటలకు మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్య జరిగింది. సిక్కు వర్గానికి చెందిన సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్‌లు ఇందిరాగాంధీకి బాడీగార్డులుగా ఉండేవారు. వారిద్దరూ కలిసి ఇందిరాగాంధీపై కాల్పులు జరిపారు. స్వర్ణ దేవాలయంలో ఆపరేషన్ బ్లూస్టార్ నిర్వహించినందుకు ప్రతీకారంగా  సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్‌ ఈ హత్య చేశారు.   అదే రోజు(1984 అక్టోబరు 31న)  దేశ రాజధాని ఢిల్లీలో సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగాయి. ఈ అంశాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాజాగా మరోసారి స్పందించారు. ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read :Water Attack : పాక్‌పై వాటర్ స్ట్రైక్.. బాగ్లిహార్ డ్యాం గేట్లు క్లోజ్

80వ దశకంలో జరిగింది తప్పే 

‘‘ఆపరేషన్ బ్లూస్టార్(Rahul Gandhi) జరిగినప్పుడు, సిక్కులకు వ్యతిరేకంగా అల్లర్లు జరిగినప్పుడు నేను అక్కడ లేను’’ అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ‘‘ఒకవేళ ఆనాడు కాంగ్రెస్ పార్టీ వల్ల తప్పులు జరిగి ఉంటే, ప్రతీ తప్పునకు బాధ్యత వహించేందుకు నేను రెడీ. నేను సంతోషంగా ఆ బాధ్యతను తీసుకుంటాను’’ అని ఆయన వెల్లడించారు.  ‘‘80వ దశకంలో జరిగింది తప్పే అని నేను బహిరంగంగా ఇప్పటికే చెప్పాను.  ఈవిషయం అందరికీ తెలుసు. నేను చాలా సార్లు స్వర్ణ దేవాలయానికి కూడా వెళ్లాను. భారతదేశంలోని సిక్కు సమాజంతో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి’’ అని రాహుల్ గాంధీ తెలిపారు.

Also Read :Nuclear Warning: దాడి చేసినా.. నీళ్లు ఆపినా.. అణుబాంబులు వేస్తాం : పాక్

రాహుల్ వ్యాఖ్యలకు కారణమిదీ.. 

ఇటీవలే అమెరికాలో పర్యటించిన సందర్భంగా బ్రౌన్ యూనివర్సిటీలోని వాట్సన్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ అఫైర్స్ విద్యార్థులతో రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు రాహుల్ గాంధీ సమాధానమిచ్చారు.  రాహుల్ గాంధీని ఒక సిక్కు విద్యార్థి  ప్రశ్నిస్తూ.. ‘‘1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సజ్జన్ కుమార్‌ను దోషిగా కోర్టు తేల్చింది. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సజ్జన్ కుమారులు ఉన్నారు. మీరు సిక్కులతో సయోధ్యకు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు . మీరు ఇలాగే కొనసాగితే బీజేపీ పంజాబ్లోకి సైతం ప్రవేశిస్తుంది’’ అని పేర్కొన్నాడు. దీనికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పైవిధంగా బదులిచ్చారు.