Site icon HashtagU Telugu

Kapil Sibal On Rahul Gandhi : గాంధీల‌పై మ‌ళ్లీ ‘జీ 23’ గ‌ళం

Rahul Gandhi Tweet

Rahul Gandhi Tweet

జీ23 నేత‌లు క్ర‌మంగా మ‌ళ్లీ గ‌ళం విప్పుతున్నారు. గాంధీ కుటుంబం నుంచి కాంగ్రెస్ పార్టీని కాపాడాల‌ని క‌పిల్ సిబాల్ మీడియాకు ఎక్కాడు. అధ్య‌క్షునిగా లేక‌పోయిన‌ప్ప‌టికీ ఆ త‌ర‌హా ప‌వ‌ర్ ను రాహుల్ కొన‌సాగిస్తున్నాడ‌ని ఫైర్ అయ్యాడు. పంజాబ్ రాష్ట్రంలో చ‌న్నీని సీఎం చేయ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నించాడు. ఎన్నిక‌ల ముందు పంజాబ్ లో రాహుల్ చేసిన త‌ప్పిదం వ‌ల్ల ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ చావు దెబ్బ తింద‌ని సిబాల్ అభిప్రాయ‌ప‌డ్డాడు.సోనియాగాంధీ నాయ‌క‌త్వాన్ని సీడ‌బ్ల్యూసీ బ‌ల‌ప‌రిచిన‌ప్ప‌టికీ వెలుప‌ల‌కు వ‌చ్చిన త‌రువాత ఎవ‌రూ స‌మ‌ర్థించ‌డంలేద‌ని ధ్వ‌జ‌మెత్తాడు. నాయ‌క‌త్వ ప‌ద‌వుల నుంచి గాంధీలు తప్పుకోవాల‌ని జీ 23 కీల‌క నేత‌ల సిబాల్ మ‌రోసారి స్వ‌రం పెంచాడు. నామినేట్ చేసుకుని ప‌ద‌వుల‌ను అనుభ‌విస్తోన్న గాంధీలు ఉంటే `ఘ‌ర్ కీ కాంగ్రెస్ ` మాత్ర‌మే ఉంటుంద‌ని వ్యాఖ్యానించ‌డం దుమారం రేపుతోంది.

పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీని తిరిగి రావాలని పెరుగుతున్న డిమాండ్ గురించి అడిగినప్పుడు, రాహుల్ గాంధీ ఇప్పటికే అన్ని నిర్ణయాలను తీసుకునే “వాస్తవ అధ్యక్షుడు” అని కపిల్ సిబల్ అన్నారు. రాహుల్ గాంధీ పంజాబ్ వెళ్లి చరణ్ జిత్ సింగ్ చన్నీ ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించారు. అతను ఏ హోదాలో చేశాడు? ఆయన పార్టీ అధ్యక్షుడు కాదు, అన్ని నిర్ణయాలూ ఆయనే తీసుకుంటారు. ఆయన ఇప్పటికే వాస్తవ అధ్యక్షుడిగా ఉన్నారు. అలాంటప్పుడు ఆయనను తిరిగి అధికార పగ్గాలు చేపట్టాలని ఎందుకు అడుగుతున్నారు? అంటూ సిబాల్ ఫైర్ ప్ర‌శ్నించ‌డం కాంగ్రెస్ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతోంది.ప్ర‌స్తుతం ఉన్న కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు “ఘర్ కీ కాంగ్రెస్”కి విరుద్ధంగా “సబ్ కీ కాంగ్రెస్”ని కోరుకుంటున్నార‌ని గుర్తు చేశాడు. ఆ దిశ‌గా చివ‌రి శ్వాస వ‌ర‌కు ‘సబ్ కీ కాంగ్రెస్’ కోసం పోరాడతానంటూ సిబాల్ చెప్పాడు. ఈ ‘సబ్ కీ కాంగ్రెస్’ అంటే భారతదేశంలో బిజెపి వ్య‌తిరేకుల‌ను ఒకచోట చేర్చడం, ”అని కపిల్ సిబల్ మీడియాకు విశ‌దీక‌రించాడు.“CWC వెలుపల కాంగ్రెస్ ఉంది, మీరు ఎంచుకుంటే వారి అభిప్రాయాలను దయచేసి వినండి. సిడబ్ల్యుసిలో కాని కాంగ్రెస్‌లో కాని మా లాంటి చాలా మంది నాయకులకు పూర్తిగా భిన్నమైన దృక్పథం ఉంది, ”అని సిబాల్ అన్నాడు. పార్టీలో పెద్ద మార్పులు చేయాలని 2020లో సోనియా గాంధీకి రాసిన లేఖ రాసిన 23 మంది సీనియ‌ర్ల‌లో కపిల్ సిబల్ కూడా ఉన్నాడు. ఇప్పుడు ఆయ‌న మ‌ళ్లీ ఆనాటి వాదాన్ని వినిపించ‌డం కాంగ్రెస్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.