Priyanka Gandhi : కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా వయనాడ్‌లో జరగనున్న ఉప ఎన్నికల సందర్భంగా ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె బీజేపీ త్రీవ ఆరోపణలు చేశారు. వయనాడ్ ప్రజల కోసం రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటాన్ని గురించి ప్రస్తావించారు. నా సోదరుడు రాహుల్ గాంధీ సత్యం కోసం ఎంతో పోరాటం చేస్తున్నారు. ఈ విషయం వయనాడ్ ప్రజలకు అర్థమైంది. అతడికి వ్యతిరేకంగా తప్పుగా ప్రచారాలు జరిగాయి. అవన్నీ ఆరోపణలని వయనాడ్ గ్రహించింది. స్థానిక మెడికల్ కళాశాలలో సౌకర్యాలను మెరుగుపరచడానికి ఆయన ఎంతో పోరాడారు. అయితే.. ఆ సౌకర్యాలు మరింత మెరుగుపడాల్సి ఉంది. ఆ సమస్యలను పరిష్కరిస్తాను అని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు.
దేశానికి వెన్నెముక అయిన రైతును మోడీ సర్కార్ పట్టించుకోవడం లేదు. కనీసం మద్దతు ధర ప్రకటించలేదు. వారికి మిత్రులైన కొందరు వ్యాపారవేత్తలకు రూ. 16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారు. కానీ, మీ సమస్యలను పరిష్కరించాలని అనుకోవడం లేదు. ఉద్యోగ అవకాశాలు, మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడం వారి లక్ష్యం కాదు. అధికారం కోసమే వారి పోరాటం. అందుకోసం సమాజాన్ని విభజించి, ద్వేషాన్ని వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు” అని ప్రియాంక గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ ఓ మార్గం చూపారు. ఆయన మీ సమస్యలను పార్లమెంట్‌లో లేవనెత్తారు. కానీ, ప్రభుత్వాలు మాత్రం ప్రజల కోసం పని చేయడం లేదన్నారు. ఇకపోతే.. ప్రియాంక గాంధీ రాహుల్ ఈ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రియాంక గాంధీ నా సోదరి కావడం నిజంగా నా అదృష్టం. ఆమె మీకు తల్లి, సోదరి, కూతురిలా ఉంటుంది. మీరు త్వరలో అత్యుత్తమ ఎంపీని పొందుతారని విశ్వసిస్తున్నా” అని అన్నారు.