Rahul Gandhi – Satya Pal Malik : సత్యపాల్‌ను ఇంటర్వ్యూ చేసిన రాహుల్.. సంచలన ఆరోపణలతో దుమారం

Rahul Gandhi - Satya Pal Malik : 2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడికి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మరోసారి ఆరోపించారు.

  • Written By:
  • Updated On - October 25, 2023 / 05:31 PM IST

Rahul Gandhi – Satya Pal Malik : 2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడికి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మరోసారి ఆరోపించారు. దేశ నిఘా వ్యవస్థ విఫలం కావడం వల్లే 40 మంది సైనికులను కోల్పోవాల్సి వచ్చిందని ఆయన మండిపడ్డారు. సత్యపాల్‌ను తాను స్వయంగా ఇంటర్వ్యూ చేసిన ఒక వీడియోను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. ఈ ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలను సత్యపాల్ మాలిక్ ప్రస్తావించారు.

మౌనంగా ఉండాలని హెచ్చరించారు : సత్యపాల్ మాలిక్

‘‘పుల్వామా దాడి జరిగినప్పుడు ప్రధాని మోడీతో మాట్లాడేందుకు ప్రయత్నించాను. కానీ అప్పుడు సాధ్యపడలేదు. ఆ తరువాత మోడీయే కాల్ చేసి మాట్లాడారు. మన తప్పిదం వల్లే అంతమంది చనిపోయారని నేను మోడీతో వాదించాను. భద్రతాపరమైన లోపాలను ఎత్తి చూపినందుకు మౌనంగా ఉండాలని ప్రధాని మోడీ నన్ను హెచ్చరించారు. ఎక్కడా ఏమీ మాట్లాడొద్దని సూచించారు’’ సత్యపాల్ మాలిక్(Rahul Gandhi – Satya Pal Malik)  పేర్కొన్నారు.

Also Read: world cup 2023: నెదర్లాండ్స్ పై డేవిడ్ వార్నర్ సెంచరీ

‘‘ఆ తర్వాత నాకు అజిత్ దోవల్‌ కాల్ చేశారు. ఆయన కూడా నన్ను వారించారు. కానీ అప్పటికే నేను మీడియాతో మాట్లాడాను. నా వ్యాఖ్యల వల్ల విచారణ తప్పుదోవ పట్టే అవకాశముందని అనుకున్నాను. కానీ అసలు విచారణే జరగలేదు. ఆ తరవాత మోడీ వచ్చి ప్రసంగించి దాన్ని కూడా రాజకీయం చేసుకున్నారు’’ అని ఆయన సంచలన ఆరోపణ చేశారు. ‘‘కేంద్ర ప్రభుత్వం కల్పించుకోనంత వరకు మణిపూర్ ప్రశాంతంగానే ఉంది. కేంద్రం కల్పించుకున్న తర్వాతే అక్కడ అల్లర్లు మొదలయ్యాయి. ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే’’ అని సత్యపాల్ మాలిక్ ఆరోపించారు.

We’re now on WhatsApp. Click to Join.

‘‘పుల్వామా దాడి ఎందుకు జరిగిందని నన్ను చాలా మంది అడిగారు. ఆ టైంలో సైనికులు 5 విమానాలు కావాలని అడిగారు. ఒకవేళ వాళ్లు నన్ను అడిగి ఉంటే నేను వాళ్లకు కచ్చితంగా ఏర్పాటు చేసే వాడిని. ఓ సారి కొంతమంది విద్యార్థులు మంచులో చిక్కుకుపోతే ప్రత్యేకంగా ఎయిర్‌క్రాఫ్ట్ పంపి వాళ్లను సురక్షితంగా తీసుకొచ్చేలా చొరవ తీసుకున్నాను. ఢిల్లీలో ఎయిర్‌క్రాఫ్ట్‌లను సులభంగా అద్దెకి తీసుకోవచ్చు. కానీ కేంద్ర హోం శాఖ మాత్రం సైనికుల విజ్ఞప్తిని పట్టించుకోలేదు. ఎయిర్‌క్రాఫ్ట్‌‌ను ఇవ్వలేదు. చేసేదేమీ లేక వాళ్లంతా రోడ్డు మార్గంలోనే వెళ్లారు’’ అని కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ వివరించారు.