Fifth Phase – Key Candidates : లోక్‌సభ ఎన్నికల ఐదో విడత పోలింగ్ మే 20న జరగనుంది. ఈదఫాలో 8 రాష్ట్రాలు, యూటీల పరిధిలోని 49 లోక్‌సభ స్థానాల్లో ఓటింగ్ ఘట్టం జరగనుంది. ఈసారి కొన్ని స్థానాల్లో హోరాహోరీ పోరు నెలకొంది. కాంగ్రెస్, బీజేపీ సహా పలు పార్టీలకు చెందిన కీలక అభ్యర్థులు(Fifth Phase – Key Candidates) ఎన్నికల బరిలో ఉన్నారు.
We’re now on WhatsApp. Click to Join
రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 2019 వరకు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీ నియోజకవర్గంలో మరోసారి గెలవాలనే పట్టుదలతో రాహుల్ గాంధీ ఉన్నారు. బీజేపీ అభ్యర్థి దినేశ్ సింగ్ నుంచి రాహుల్‌కు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. రాయ్‌బరేలీలో దాదాపు గత రెండున్నర దశాబ్దాలుగా సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహించారు. ఇటీవల ఆమె రాజ్యసభకు నామినేట్ అయ్యారు. దీంతో రాయ్‌బరేలీ నుంచి రాహుల్ పోటీకి దిగారు. మరోవైపు కేరళలోని వయనాడ్ నుంచి కూడా ఆయన పోటీ చేశారు. ఈ రెండు స్థానాల్లో రాహుల్ ప్రయారిటీ రాయ్ బరేలీకే ఉంటుందని భావిస్తున్నారు. ఒకవేళ రెండు చోట్ల కూడా గెలిస్తే రాయ్‌బరేలీని ఉంచుకొని.. వయనాడ్‌ను వదిలేసే అవకాశం ఉంది. ఉత్తరాదిలో బీజేపీ బలంగా ఉంది. అక్కడ కాషాయ పార్టీని ఢీకొనేందుకు రాయ్‌బరేలీ స్థానాన్ని ఉంచుకుంటే బెటర్ అని రాహుల్ భావిస్తున్నారు.
రోహిణీ ఆచార్య
రోహిణీ ఆచార్య.. బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె. ఈమె బిహార్‌లోని సారణ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడి నుంచి బీజేపీ తరఫున రాజీవ్ ప్రతాప్ రూడీ బరిలోకి దిగారు. ఇక్కడ వీరిద్దరి మధ్య టఫ్ ఫైట్ జరుగుతోంది. గెలుపు అవకాశాలు మాత్రం లాలూ కుమార్తెకే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఆర్జేడీ బలంగా ఉండటం, స్థానికంగా కాంగ్రెస్ మద్దతు ఉండటం రోహిణీ ఆచార్యకు ప్లస్ పాయింట్‌గా మారనుంది.
Also Read :IMD Red Alert : ఉత్తరాదికి రెడ్ అలర్ట్.. తెలంగాణకు రెయిన్ అలర్ట్
చిరాగ్ పాసవాన్
ఎల్జేపీ(రామ్ విలాస్) పార్టీ చీఫ్ చిరాగ్ పాసవాన్ పోటీ చేస్తున్నహాజీపూర్ స్థానంపై అందరి ఫోకస్ ఉంది. గతంలో తన తండ్రి దివంగత రామ్ విలాస్ పాసవాన్ పోటీ చేసిన హాజీపూర్ స్థానంలో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో చిరాగ్ ఉన్నారు. చిరాగ్‌పై ఆర్జేడీ తరఫున శివ చంద్రరామ్ పోటీకి దిగారు.
రాజ్‌నాథ్
బీజేపీ అగ్రనేత, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఉత్తరప్రదేశ్‌లోని లక్నో నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడి నుంచి వరుసగా మూడోసారి గెలవాలని ఆయన భావిస్తున్నారు. రాజ్‌నాథ్ సింగ్‌పై సమాజ్‌వాదీ పార్టీ రవిదాస్ మెహ్రోత్రా పోటీ చేస్తున్నారు. 2019లో ఆరు లక్షల పైగా మెజారిటీతో గెలిచిన రాజ్‌నాథ్ ఈసారి కూడా అదే రేంజులో మెజారిటీ సాధించాలని భావిస్తున్నారు.
స్మృతి ఇరానీ
అమేథీ నుంచి మరోసారి గెలవాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఉవ్విళ్లూరుతున్నారు. 2019లో ఇదే సీటులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఆమె ఓడించారు. ఈసారి కూడా అమేథీ నుంచే రాహుల్ పోటీ చేస్తారని అందరూ భావించారు. కానీ ఆయన అత్యంత సురక్షితమైన రాయ్‌బరేలీ స్థానానికి మారిపోయి అందరినీ ఆశ్చర్యపరిచారు. కాంగ్రెస్ పార్టీ తరఫున కిశోరీ లాల్ బరిలోకి దిగారు.
పీయూశ్ గోయల్
కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ ముంబయి నార్త్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనపై కాంగ్రెస్ పార్టీ భూషణ్ పాటిల్‌ను బరిలో దింపింది. మహారాష్ట్రలో బీజేపీ అధికారంలో ఉండటం పీయూశ్ గోయల్‌కు కలిసొచ్చే అవకాశం ఉంది. అయితే ఉద్ధవ్ థాక్రే శివసేన వర్గం మద్దతు ఉండటం అనేది కాంగ్రెస్ అభ్యర్థికి కొంత కలిసి రావచ్చు.