Site icon HashtagU Telugu

Rahul Gandhi: రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్.. పరువు నష్టం కేసులో బెయిల్!

Rahul Gandhi

Rahul Gandhi

పరువు నష్టం కేసులో జైలు శిక్షతో అనర్హత వేటు ఎదుర్కొన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సూరత్ సెషన్స్ కోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఈ కేసులో రాహుల్ గాంధీకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మోదీ ఇంటి పేరుకు సంబంధించి పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రేండేళ్లు జైలు శిక్ష వేసిన విషయం తెలిసిందే. కాగా తనపై విధించిన శిక్షను రద్దు చేయాలనీ..రాహుల్ గాంధీ సూరత్ సెషన్స్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ ను పరిగణలోకి తీసుకున్న కోర్టు విచారణ జరిపింది.

ఈ క్రమంలో రాహుల్ బెయిల్ ను ఈనెల 13 వరకు పొడిగిస్తూ సెషన్స్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే తదుపరి విచారణను మే 3కు వాయిదా వేసింది. బెయిల్ పొడిగింపుతో రాహుల్ కు ఊరట లభించింది. అలాగే తనని దోషిగా నిర్ధారిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టాలని రాహుల్ కోరారు. అలాగే సెషన్స్ కోర్టు తీర్పు వెలువడే వరకు తనను దోషిగా తేల్చిన ట్రయల్ కోర్టు తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్ధించారు. గాంధీ అభ్యర్థనను అంగీకరించిన కోర్టు ఏప్రిల్ 13న విచారణకు నిర్ణయించింది. అయితే, న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేసేందుకు ఏప్రిల్ 22 వరకు మరో గడువు విధించారు. ఎంపీ హోదాలో రాహుల్ గాంధీకి అధికారిక నివాసం కేటాయించారు.