Site icon HashtagU Telugu

Rahul Gandhi: నా పేరు రాహుల్.. నా ఇల్లు ఇండియా

Rahul Gandhi

New Web Story Copy 2023 08 08t165834.871

దేశ రాజకీయాల్లో రాహుల్ గాంధీ ఒక్కసారిగా దూసుకొచ్చారు. భారత్ జోడో యాత్ర తరువాత ప్రజల్లో ఆయనపై మరింత నమ్మకం పెరిగింది. దీంతో కాంగ్రెస్ లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. గత కర్ణాటక ఎన్నికలే దానికి నిదర్శనం. దేశంలో బీజేపీకి తెరుగులేదన్న ఒక అపవాదును తుడిచిపెట్టింది కాంగ్రెస్. కర్ణాటకలో కాంగ్రెస్ జెండా ఎగురవేసి శ్రేణుల్లో జోష్ నింపింది. ఇదిలా ఉండగా దేశ రాజకీయాలను ఆశ్చర్యానికి గురి చేసిన అంశం రాహుల్ గాంధీ తన లోక్ సభ సభ్యుత్వం కోల్పోవడం. మోడీ ఇంటిపేరుపై చేసిన కామెంట్స్ తన పదవినే కోల్పోయేలా చేశాయి. అయితే ఒక పార్టీ అగ్రనేతను ఇంటికి పంపించేయడం దేశ రాజకీయాల్లో అరుదు. బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయంతో బాగా లాభపడింది మాత్రం కాంగ్రెసే. ఎందుకంటే గాల్లోకి బంతిని ఎంత బలంగా విసిరితే అదే స్పీడ్ లో బంతి కిందకు వస్తుంది. అలానే రాహుల్ సభ్యత్వంపై చెలరేగిన రగడ తిరిగి ఆయనకు అనుకూలంగా మారింది.

రాహుల్ గాంధీ కేసు విషయంలో సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. ఈ క్రమంలో కేసుపై స్టే విధించింది. దీంతో రాహుల్ మళ్ళీ ఎంపీ స్థానంలో పార్లమెంట్లో అడుగుపెట్టాడు. అదేవిధంగా ఆయనకు కేటాయించిన అధికారిక నివాసం తుగ్లక్ లేన్‌లోని బంగ్లాకు చేరుకున్నారు. దీనిపై మీడియా రాహుల్ ని ప్రశ్నించింది. రాహుల్ ఇచ్చిన సమాధానం పలువుర్ని ఆకట్టుకుంటుంది. ఇంతకీ రాహుల్ ఏమన్నారంటే.. హిందుస్థాన్ మొత్తం నా ఇల్లు అంటూ అదిరిపోయే రిప్లయ్ ఇచ్చారు. రాహుల్ చెప్పిన సమాధానం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలో అల్లు అర్జున్ చెప్పినట్టుగానే ఉందంటున్నారు నెటిజన్స్.

Also Read: Air Travel: విమాన ఛార్జీల పెంపు.. పార్లమెంట్‌లో చర్చ..!