Rahul Gandhi: మెకానిక్‌ అవతారమెత్తిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ..!

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మంగళవారం కరోల్ బాగ్‌లో ఆకస్మిక పర్యటన చేసి మోటార్‌సైకిల్ మెకానిక్‌లతో సమావేశమయ్యారు.

Published By: HashtagU Telugu Desk
Rahul Gandhi

Resizeimagesize (1280 X 720)

Rahul Gandhi: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మంగళవారం కరోల్ బాగ్‌లో ఆకస్మిక పర్యటన చేసి మోటార్‌సైకిల్ మెకానిక్‌లతో సమావేశమయ్యారు. రాహుల్ ఫేస్‌బుక్‌లో మెకానిక్‌లతో కలిసి పని చేస్తున్న చిత్రాలను పోస్ట్ చేసారు. భారత్‌ జోడో యాత్రలో సామాన్యులతో మమేకమైన కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మరోసారి ఢిల్లీ వీధుల్లో స్థానికులకు కలిశారు. ఈ నేపథ్యంలో బైక్‌ మెకానిక్‌ల వద్దకు వెళ్లి వారితో ముచ్చటించారు. కాసేపు మెకానిక్‌ అవతారమెత్తి.. బైక్‌ రిపేర్‌ చేయడంలో మెలకువలు తెలుసుకుంటూ వారికి సాయం చేశారు. రాహుల్‌ రాకతో పెద్ద ఎత్తున స్థానికులు గుమిగూడటంతో వారికి పేక్‌ హ్యాండ్‌ ఇచ్చారు.

Also Read: Pawan Kalyan: ప‌వ‌న్ వ్యూహం ఫ‌లిస్తుందా? తూర్పు కాపుల స‌మావేశంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

రాహుల్ గాంధీ కరోల్ బాగ్ మార్కెట్‌కు చేరుకున్న చిత్రాలను కాంగ్రెస్ పార్టీ కూడా పంచుకుంది. ఈ చేతులే భారతదేశాన్ని తయారుచేశాయని అన్నారు. ఈ బట్టలపై ఉన్న మసి మన గర్వం. అలాంటి చేతలను ప్రోత్సహించే పని ఒక ప్రజానాయకుడు మాత్రమే చేస్తాడు అని పేర్కొంది.  రాహుల్ గాంధీ బైక్ మెకానిక్‌తో కలిసి బైక్ భాగాలపై పని చేస్తున్నట్టు ఈ ఫోటోలలో చూడవచ్చు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న యంత్రాలపై కూడా కాంగ్రెస్ నేత ఆరా తీశారు.

గతంలో రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి చండీగఢ్ వెళ్లే సమయంలో ట్రక్కులో ప్రయాణిస్తూ కనిపించారు. రాహుల్ గాంధీ పలు సమస్యలపై ట్రక్కు డ్రైవర్లతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కర్ణాటక ఎన్నికల సమయంలో రాహుల్ బెంగళూరులో డెలివరీ బాయ్‌తో కలిసి స్కూటర్‌పై వెళుతుండగా దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొద్ది రోజుల క్రితం రాహుల్ గాంధీ ఇదే విధంగా పాత ఢిల్లీ ప్రాంతానికి హఠాత్తుగా చేరుకున్నారు. రాహుల్ ప్రజలను కలుసుకుని చాట్ తిన్నారు. భారత్‌లో జోడో యాత్ర తర్వాత కూడా రాహుల్ సాధారణ ప్రజలతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకుంటున్నారు.

  Last Updated: 28 Jun 2023, 07:17 AM IST