Site icon HashtagU Telugu

Rahul Gandhi: ట్రాక్టర్ నడిపి.. వరినాట్లు వేసి, రైతులతో రాహుల్ ముచ్చట్లు

Rahul

Rahul

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. ఆయన ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర అన్ని వర్గాలను ఆకర్షించింది. ఆయన పాదయాత్ర ఊహించని విధంగా సక్సెస్ కావడంతో రాహుల్ లో కొత్త జోష్ కనిపిస్తోంది. అదే ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ట్రక్కు నడిపి, మెకానిక్ గా అవతారమెత్తిన రాహుల్ తాజాగా రైతుగా మారాడు.

శనివారం ఉదయం ఆయన హర్యానాలోని సోనీపట్(Sonipat) సమీపంలోని మదీనా గ్రామంలో పొలంలో దిగి, రైతులతో కలగలిసిపోయి, వరి నాట్లు వేశారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. రాహుల్ గాంధీ శనివారం ఉదయం హిమాచల్ ప్రదేశ్ వెళ్తూ మార్గమధ్యంలో మదీనా గ్రామంలో పొలాల్లో పని చేసుకునేవారిని చూశారు. వెంటనే కారును ఆపి, పొలంలో దిగి, ట్రాక్టర్‌తో దుక్కి దున్నారు. ఆ తర్వాత తన ప్యాంటును మోకాళ్ల పై వరకు మడిచి, పొలంలోకి దిగారు. రైతులు వరినాట్లు వేస్తున్న విధానాన్ని పరిశీలించి, తాను కూడా కొన్ని వరి మొక్కలను తీసుకుని, నాటారు.

అనంతరం అక్కడి రైతులతోనూ, కూలీలతోనూ ఆయన(Rahul Gandhi) మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో అన్ని వర్గాలవారితోనూ మాట్లాడిన సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో ఆయన సమాజంలోని వివిధ వర్గాలవారితో ముచ్చటిస్తూ, వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. వారితో ఆత్మీయంగా మాట్లాడుతున్నారు. అధికార పార్టీ నాయకుల విమర్శకులను పక్కనపెట్టి తనదైన స్టైలో ముందుకు దూసుకుపోతున్నారు రాహుల్.

Also Read: Tamilnadu: కోరిన కోరికలు తీర్చే నామక్కల్ హానుమాన్! ఎన్నో విశిష్టతలు ఈ ఆలయం సొంతం