Rahul Gandhi Assets: రాహుల్ గాంధీ ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవుతారు

రాహుల్ గాంధీ దాఖలు చేసిన నామినేషన్ పిటిషన్‌లో తన ఆస్తి వివరాలను పేర్కొన్నారు. అందులో తనకు రూ.20 కోట్లకు పైగా ఆస్తులున్నట్లు ప్రకటించారు. అఫిడవిట్‌లో ఆయన పేర్కొన్న ఆస్తి విలువ వివరాలు ఇలా ఉన్నాయి:

Rahul Gandhi Assets: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ, కేఎల్ శర్మ అమేథీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. నిన్న శుక్రవారం రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు. రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేసే సమయంలో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే కూడా ఉన్నారు. అయితే ఇప్పటికే కేరళలోని వాయనాడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న రాహుల్ గాంధీ రాయ్ బరేలీ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో కేరళలోని వాయనాడ్ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ రికార్డు మెజారిటీ గెలుపొందారు. అదే సమయంలో అమేఠీలో తన ప్రత్యర్ధి బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో దారుణంగా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. కాగా వయనాడ్ నుంచి రాహుల్ గాంధీపై సీపీఐ తరుపున అన్నీ రాజా పోటీ చేస్తున్నారు. బీజేపీ తరుపున సురేంద్రన్ బరిలో ఉన్నారు.

We’re now on WhatsAppClick to Join

రాహుల్ గాంధీ దాఖలు చేసిన నామినేషన్ పిటిషన్‌లో తన ఆస్తి వివరాలను పేర్కొన్నారు. అందులో తనకు రూ.20 కోట్లకు పైగా ఆస్తులున్నట్లు ప్రకటించారు. అఫిడవిట్‌లో ఆయన పేర్కొన్న ఆస్తి విలువ వివరాలు ఇలా ఉన్నాయి:

1. చరాస్తుల విలువ రూ.9.24 కోట్లు.

2. స్థిరాస్తి విలువ రూ.11.15 కోట్లు.

3. సొంత వాహనం లేదు.

4. అపార్ట్మెంట్ లేదు.

5. చేతిలో 55 వేల రూపాయలు.

6. 26.25 లక్షల రూపాయలను బ్యాంకులో డిపాజిట్ చేశారు.

7. రూ.4.33 కోట్ల విలువైన బాండ్లు మరియు షేర్లు.

8. రూ.3.81 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్స్.

9. రూ.15.21 లక్షల విలువైన బంగారు బాండ్ ఉంది.

10. రూ.4.20 లక్షల విలువైన ఆభరణాలు.

11. గురుగ్రామ్‌లో రూ.9 కోట్ల విలువైన సొంత కార్యాలయం.

12. ఢిల్లీలోని మెహరౌలి ప్రాంతంలో సోదరి ప్రియాంకగాంధీతో కలిసి వ్యవసాయభూమి ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అందులో ప్రియాంక వాద్రాకు పార్టనర్ షిప్ ఉన్నట్టు వెల్లడించారు.

13. రూ. 49.7 లక్షల అప్పు ఉన్నట్టు తెలిపారు

Also Read: Canada : హర్‌దీప్ సింగ్‌ నిజ్జార్‌ హత్య కేసు..ముగ్గురు భారతీయుల అరెస్ట్‌