Rahul Gandhi: ఐశ్వర్యరాయ్ పై రాహుల్ గాంధీ హాట్ కామెంట్స్

మీడియా ఛానెళ్లు ఐశ్వర్యరాయ్ డ్యాన్సులను చూపిస్తున్నాయి కానీ పేదప్రజల స్థితిగతులను గురించి మాత్రం ప్రసారాలు చేయడం లేదు అని రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ సోషల్ మిడిల్ వైరల్ గా మారాయి.

Rahul Gandhi: మీడియా ఛానెళ్లు ఐశ్వర్యరాయ్ డ్యాన్సులను చూపిస్తున్నాయి కానీ పేదప్రజల స్థితిగతులను గురించి మాత్రం ప్రసారాలు చేయడం లేదు అని రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ సోషల్ మిడిల్ వైరల్ గా మారాయి. 53 ఏళ్ల రాహుల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇటు రాజకీయంగాను, అటు బాలీవుడ్ ఇండస్ట్రీలోను తీవ్ర దుమారంగా మారాయి. దీంతో రాజకీయంగా ప్రత్యర్థి పార్టీలు రాహుల్ పై మండిపడుతున్నారు. మహిళలను కించపరచడమే రాహుల్ పని అంటూ ఫైర్ అవుతున్నారు.

రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఆయన తన ప్రవర్తనతో మరింత దిగజారిపోయారంటూ విరుచుకుపడింది. ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను టార్గెట్ చేశారు. సిద్ధరామయ్య గారు .. మీ బాస్ మీ తోటి కన్నడిగులను అవమానిస్తున్నారు. ఆ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తారా? లేక.. కుర్చీ కోసం మౌనంగా ఉండిపోతారా అని ప్రశ్నిస్తున్నారు.

వారణాసిలో జరుగుతున్న భారత్ జోడో న్యాయ యాత్రలో రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ పై బాలీవుడ్ గాయని సోనా మహాపాత్ర కూడా రాహుల్‌ను టార్గెట్ చేసింది. సోనా మహాపాత్ర సోషల్ మీడియాలో రాహుల్ పై మండిపడ్డారు.రాహుల్ ప్రకటనను అవమానకరమైనదిగా పేర్కొన్నాడు. రాజకీయ ప్రయోజనాల కోసం నాయకులు మహిళలను అవమానించడం మానుకోవాలని అన్నారు.కొందరు నాయకులు తమ స్వలాభం కోసం ప్రసంగాల సమయంలో మహిళలను అవమానిస్తారా? ప్రియమైన రాహుల్ గాంధీ, ఎవరైనా మీ తల్లిని, సోదరిని అవమానించి ఉండాలి అంటూ ఫైర్ అయ్యారు.

వారణాసిలో ప్రజలను ఉద్దేశించి రాహుల్ ప్రసంగిస్తూ పలు మీడియా సంస్థలపై విమర్శలు గుప్పించారు. ఇవి ఎవరి మీడియా సంస్థలు అని ఆయన అన్నారు. భారతదేశంలోని పేదల గురించి మీడియా చూపించదు. మీడియా ఐశ్వర్యరాయ్ డ్యాన్స్‌ని చూపిస్తుంది అంటూ రాహుల్ కామెంట్స్ దుమారం రేపాయి.

Also Read: Kishan Reddy:మేడారం జాతరకు జాతీయ పండుగ గుర్తింపు సాధ్యం కాదుః కిషన్ రెడ్డి

Follow us