Site icon HashtagU Telugu

Rahul Gandhi: మాట వినకపోతే ఆ నాయకులను బీజేపీకి గిఫ్ట్ గా ఇచ్చేస్తా : రాహుల్ గాంధీ

Rahul Gandhi

Rahul Gandhi

ఎప్పుడూ సాఫ్ట్ గా, కూల్ గా కనిపించే, మాట్లాడే రాహుల్ ఇప్పుడు పూర్తిగా తన స్టైల్ ను మార్చేశారు. మాటల్లో వాడి వేడి పెరిగింది. విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. ఇప్పటివరకు అధికారపక్షాన్ని విమర్శించిన కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీ ఇప్పుడు సొంత పార్టీ నేతలకే క్లాస్ పీకారు. యూపీలో అసెంబ్లీ ఎన్నిక‌లు ఇంకా కొన‌సాగుతుండ‌గానే గుజ‌రాత్‌పై దృష్టి పెటారు.

కొడితే ఏనుగు కుంభ‌స్థలాన్నే కొట్టాలి అన్నట్టుగా గుజ‌రాత్‌ను గెలుచుకోవాల‌ని ప్రయ‌త్నిస్తున్నారు. ఇందుకోసం ముందుగా congress పార్టీనే ప్రక్షాళ‌న చేయాల‌ని భావిస్తున్నారు. తొలుత త‌న ప్రసంగ‌శైలిని మార్చుకొని ప‌దునైన మాట‌లు, పంచ్‌లు వ‌దులుతున్నారు. దీంతో తమతో మాట్లాడుతోంది రాహులేనా అని పార్టీ వర్గాలే ఆశ్చర్యపోతున్నాయి.

గుజ‌రాత్‌లో జ‌రిగిన పార్టీ కార్యక‌ర్తల స‌మావేశంలో bjpపై కాకుండా సొంత పార్టీ నాయ‌కుల‌పైనే విమ‌ర్శలు గుప్పించారు రాహుల్. కొంద‌రు అబ‌ద్ధాలు చెబుతూ కార్యక‌ర్తలను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని విమ‌ర్శించారు.
అలాంటి వారిని bjpకి గిఫ్ట్‌గా ఇచ్చేస్తామ‌ని వ్యాఖ్యానించారు. వారిని కౌర‌వుల‌ని అభివ‌ర్ణిస్తూ, వారు bjpలోకి వెళ్లిపోతేనే మంచిద‌ని అన్నారు.

త‌న‌కు నిజాలు చెప్పే పాండవులు లాంటి అయిదుగురు నాయ‌కులు చాల‌ని రాహుల్ చెప్పారు. వారు మ‌రో ఇద్దరు నాయ‌కులను త‌యారు చేయాల‌ని, మొత్తంగా 25 మంది నాయ‌కుల‌తో విజ‌యం సాధిస్తామ‌ని ధీమాగా చెప్పారు.
నిజాలు చెప్పండి లేదంటే బీజేపీలో క‌లిసిపోండి అని ఆయ‌న పార్టీ నాయకుల‌కు సూటిగానే చెప్పారు.

రాష్ట్రంలో పార్టీ బ‌లంగానే ఉంద‌ని, అయితే యూనిటీ లేక‌పోవ‌డం, వెన్నుపోట్లు కార‌ణంగానే రెండు ద‌శాబ్దాలుగా ఓట‌మి పాల‌వుతున్న విష‌యాన్ని గుర్తు చేశారు. న‌రేంద్ర మోదీ రంగంలోకి వ‌చ్చిన త‌రువాత గుజ‌రాత్ నాయ‌కులు సీరియ‌స్ గా పోరాడ‌డం లేద‌ని కూడా చెప్పారు. నిజాలు చెప్పడం, నిజాయితీగా ఉండ‌గ‌లిగితే గెలుపు పెద్ద క‌ష్టమేమీ కాద‌ని కార్యక‌ర్తల‌కు నూరిపోశారు. మరి రాహుల్ మాటలు గుజరాత్ నాయకుల్లో ఎలాంటి మార్పును తీసుకువస్తుందో చూడాలి.

Exit mobile version