Rahul Gandhi : ట్రైన్‌లో ప్రయాణికులతో ముచ్చటించిన రాహుల్ గాంధీ

రీసెంట్ గా రైల్వే స్టేషన్‌కు వెళ్లి ఎర్ర చొక్కా తొడుక్కొని.. సూట్ కేసులు నెత్తిన పెట్టుకొని కూలీగా మారి అందర్నీ ఆశ్చర్య పరిచారు. ఇలా నిత్యం ప్రజల వద్దకు వెళ్లి వారి కష్టాలను తెలుసుకుంటూ వార్తల్లో

Published By: HashtagU Telugu Desk
Rahul Gandhi boards train from Bilaspur to Raipur

Rahul Gandhi boards train from Bilaspur to Raipur

మరోసారి రాహుల్ వార్తల్లో నిలిచారు. భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) చేపట్టినప్పటి నుంచి రాహుల్ (Rahul) ఎక్కువగా ప్రజల మధ్య ఉంటూ వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ వస్తున్నారు. ఈ మధ్యనే లారీలో ప్రయాణించి డ్రైవర్ల కష్టాలు తెలుసుకున్నారు.. రైతులతో కలిసి దుక్కి దున్ని నాట్లు వేసాడు.. మెకానిక్‌ని కలిసి బైక్ రిపేర్ చేయడం నేర్చుకున్నారు.. అలాగే డెలివరీ బాయ్స్ కష్టాలను తెలుసుకున్నారు. రీసెంట్ గా రైల్వే స్టేషన్‌కు వెళ్లి ఎర్ర చొక్కా తొడుక్కొని.. సూట్ కేసులు నెత్తిన పెట్టుకొని కూలీగా మారి అందర్నీ ఆశ్చర్య పరిచారు. ఇలా నిత్యం ప్రజల వద్దకు వెళ్లి వారి కష్టాలను తెలుసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఇప్పుడు ట్రైన్లో ప్రయాణం చేస్తూ తోటి ప్రయాణికులతో ముచ్చటించారు.

ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్న రాహుల్.. బిలాస్‌పూర్ (Bilaspur) నుంచి రాయ్‌పూర్‌కు వెళ్లే ట్రైన్‌లో ప్రయాణించారు. ప్రజల మధ్యకు వెళ్లి వారి మనోభావలు తెలుసుకోవడంతో పాటు.. సమస్యల్ని తెలుసుకోవడం కోసమే ఈ ప్రయాణం చేసినట్లు తెలుస్తోంది. తోటి ప్రయాణికులతో రాహుల్ ముచ్చటించారు. రైల్లోని హాకీ క్రీడాకారిణులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓ హాకీ క్రీడాకారిణి రాహుల్‌తో తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి చెప్పుకున్నారు. స్థానిక రాజనంద్‌గావ్‌(Rajnandgaon)లోని మైదానం హాకీ ఆడేందుకు అనువుగా లేదన్న విషయాన్ని రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై గతంలోనే తాము ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా రాహుల్ ‘ఖేలో ఇండియా’ ద్వారా ఆమెకు అందుతున్న వసతులపై వాకబు చేశారు.శిక్షణ వసతులు ఎలా ఉన్నాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ (Congress party) రాష్ట్ర శాఖ దీనిపై స్పందించింది. ‘‘వాళ్ల ముఖాల్లో ఆనందం చూడండి..రాహుల్ గాంధీతో కలిసి ప్రయాణించడం వారికో గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోతుంది. జననేతకు, అభినేత (నటుడు) ఉన్న తేడా ఇదే’’ అంటూ అధికార పక్షాన్ని ఉద్దేశించి సోషల్ మీడియాలో పరోక్ష విమర్శలు చేసింది. రాహుల్ వెంట ఛత్తీస్‌ఘడ్ సీఎం భూపేశ్ (CM Bhupesh) బఘేల్, ఇతర నేతలు ఉన్నారు.

Read Also : UP : ఏసీ పెంచి ఇద్దరు శిశువుల మృతికి కారణమైన డాక్టర్

  Last Updated: 26 Sep 2023, 01:03 PM IST