Site icon HashtagU Telugu

Rahul Gandhi : మా అమ్మ సన్‌స్క్రీన్ పంపింది..కానీ నేను దానిని వాడలేను..!!

Rahul Gandhi

Rahul Gandhi

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జోరుగా సాగుతోంది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపట్టిన ఈ యాత్రలో అందర్నీ పలుకరిస్తూ…సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే ఈ యాత్ర గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు రాహుల్ గాంధీ. రోజంతా నడిచి..సాయంత్రం చేస్తారన్న ప్రశ్నకు సమాధానం చెప్పారు.

రోజంతా ప్రజల్లో ఉంటాను..నడుస్తుంటాను.. సాయంత్రం యాత్ర ఆగినప్పుడు కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. మా తల్లి, సోదరి,స్నేహితులతో ఫోన్లో మాట్లాడతానని చెప్పారు. కాసేపు వ్యాయాయం చేస్తాను..కాసేపు చదువుకుంటాను అని తెలిపారు. తన తల్లి సోనియా గాంధీ తన కోసం సన్ స్క్రీన్ పంపారని..అయితే తాను దానిని ఉపయోగించలేదని చెప్పారు.

కాగా రాహుల్ గాంధీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో తాను పిల్లలతో కలిసి రోడ్డుపై షుషప్స్ చేయడం వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రాహుల్ ఫిట్ నెస్ పై ప్రశంసలు కురిపించారు.