Site icon HashtagU Telugu

Rahul Gandhi : రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తొలి వార్షికోత్సవం.. రాహుల్ కామెంట్స్..

Bharat Jodo Nyay Yatra

Rahul Gandhi Bharat Jodo Yatra Completed one Year Anniversary Celebrations by Congress

భారతదేశంలో కాంగ్రెస్(Congress) దీనస్థితికి వెళ్లిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీని పైకి లేపడానికి, బీజేపీ(BJP)కి వ్యతిరేకంగా పోరాడటానికి రాహుల్ గాంధీ(Rahul Gandhi )భారత్ జోడో యాత్ర(Bharat Jodo Yatra) ప్రారంభించారు. గతేడాది సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్రను రాహుల్ గాంధీ ప్రారంభించారు.

గతేడాది 136 రోజుల పాటు 4081 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు రాహుల్ గాంధీ. 12 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 75 జిల్లాల్లో 76 లోక్ సభ నియోజకవర్గాల్లో భారత్ జోడో యాత్ర సాగింది. ఈ యాత్రలో భాగంగా 100 పైగా గ్రూప్ ఇంటరాక్షన్స్, 250 పైగా వాకింగ్ ఇంటరాక్షన్స్, 100 కార్నర్ మీటింగ్స్, 13 భారీ ర్యాలీలు, 12 మీడియా సమావేశాలు నిర్వహించారు.

నేడు భారత్ జోడో యాత్ర తొలి వార్షికోత్సవం కాంగ్రెస్ ఘనంగా నిర్వహించింది. దేశవ్యాప్తంగా 722 భారత్ జోడో యాత్రలను ప్రతి జిల్లాలో నిర్వహించింది. దేశవ్యాప్తంగా సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు పాదయాత్రలు చేశారు. ఈ భారత్ జోడో పాదయాత్రలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అంతా పాల్గొన్నారు. యాత్ర తరువాత భారత్ జోడో సమావేశాలు నిర్వహించారు.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తొలి వార్షికోత్సవం పై మాట్లాడుతూ.. నా భారత్ జోడో యాత్ర ప్రయాణం కొనసాగుతుంది. భారత్ జోడో యాత్ర యొక్క ఐక్యత, ప్రేమ వైపు కోట్లాది అడుగులు రేపటి దేశానికి మంచి పునాదిగా మారాయి. ద్వేషం తొలగిపోయే వరకు, భారతదేశం ఏకమయ్యే వరకు నా ప్రయాణం కొనసాగుతుంది. ఇది నా వాగ్దానం అని అన్నారు. మరి ఈ జోడో యాత్ర వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఎలాంటి ఫలితాలు ఇస్తుందో చూడాలి.

 

Also Read : TCongress: కాంగ్రెస్ ఫస్ట్ లిస్టుపై ఉత్కంఠత, CWC తర్వాతనే అనౌన్స్!