Rahul Flying Kiss : రాహుల్ ఫ్లైయింగ్ కిస్‌, మంత్రి స్మృతి ఇరానీ సీరియ‌స్

రాహుల్ గాంధీ  (Rahul Flying Kiss) మ‌రో వివాదంకు తెర‌దీశారు. ఫ్లైయింగ్ కిస్ ఇస్తూ వెళ్లార‌ని మంత్రి స్మృతీ ఇరానీ ఆరోప‌ణ‌ల‌కు దిగారు.

  • Written By:
  • Updated On - August 9, 2023 / 02:51 PM IST

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ  (Rahul Flying Kiss) మ‌రో వివాదంకు తెర‌దీశారు. ఆయ‌న ప్రసంగం త‌రువాత ఫ్లైయింగ్ కిస్ ఇస్తూ వెళ్లార‌ని మంత్రి స్మృతీ ఇరానీ ఆరోప‌ణ‌ల‌కు దిగారు. ఆమె ఆరోప‌ణ‌ల మేర‌కు లోక్ స‌భ‌లోని సీసీ ఫుటేజ్ ల‌ను ప‌రిశీలిస్తున్నారు. ఒక వేళ ఆ ఫుటేజ్ ల్లో ఫ్లైయింగ్ కిస్ ఇస్తూ వెళ్లిన‌ట్టు రాహుల్ దొరికితే మ‌రోసారి ఆయ‌న మీద చ‌ర్య‌లు ఉండే ఛాన్స్ ఉంది.

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ   మ‌రో వివాదం(Rahul Flying Kiss)

అన‌ర్హ‌త వేటు నుంచి బ‌య‌ట‌ప‌డిన రాహుల్ లోక్ స‌భ స‌మావేశాల్లో కేంద్ర బిందువుగా మారారు. సుప్రీం కోర్టు ఇచ్చిన స్టే మేర‌కు లోక్ స‌భ స‌చివాల‌యం ఆయ‌న్ను తిరిగి ఎంపీగా గుర్తించింది. అంతేకాదు, ఖాళీ చేసిన ఇంటిని కూడా స‌మ‌కూర్చింది. య‌థాత‌దంగా ఆయ‌న ఎంపీ హోదాలో లోక్ స‌భ‌లోకి అడుగుపెట్టారు. అన‌ర్హ‌త వేటు నుంచి బ‌య‌ట‌ప‌డిన హీరోగా ఆయ‌న లోక్ స‌భ‌లో స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా నిలిచారు. అంతేకాదు, అవిశ్వాస తీర్మానం మీద ఆయ‌న చేసే ప్ర‌సంగం మీద అంద‌రి దృష్టి ప‌డింది. మ‌ణిపూర్ సంఘ‌ట‌న గురించి మాట్లాడారు. ఆ సంద‌ర్భంగా న‌రేంద్ర మోడీని రావ‌ణుడితో పోల్చుతూ విమ‌ర్శ‌లు గుప్పించారు. లోక్ స‌భ‌లో ఆయ‌న స్పీచ్ ప‌వ‌ర్ ఫుల్ గా (Rahul Flying Kiss)వినిపించారు.

ఫ్లైయింగ్ కిస్ ఇవ్వ‌డం రాహుల్ విప‌రీత‌ధోర‌ణికి నిద‌ర్శ‌నం

మ‌ణిపూర్ సంఘ‌ట‌న మీద మంత్రి స్మృతీ ఇరానీ మాట్లాడుతూ రాహుల్ గురించి ప్ర‌స్తవించారు. ఆయ‌న మైండ్ సెట్ ను అనుమానించారు. లోక్ స‌భలో మ‌హిళా స‌భ్యులు ఉన్నార‌ని జ్ఞానం లేకుండా ఫ్లైయింగ్ కిస్ (Rahul Flying Kiss)ఇవ్వ‌డం ఏమిట‌ని స్పీక‌ర్ ను నిల‌దీశారు. దీంతో వీడియో ఫుటేజ్ ను ప‌రిశీలించ‌డానికి స్పీక‌ర్ ఆదేశించారు. గ‌తంలోనూ ఆయ‌న స్పీచ్ ముగిసిన త‌రువాత నేరుగా ప్ర‌ధానిన‌రేంద్ర మోడీ సీటు వ‌ద్ద‌కు వ‌చ్చి ఆలింగ‌నం చేసుకున్నారు. ఆ సంఘ‌ట‌న విప‌రీత‌మైన చ‌ర్య‌గా లోక్ స‌భ‌లో బీజేపీ భావించింది. ఇప్పుడు ఫ్లైయింగ్ కిస్ ఇవ్వ‌డం రాహుల్ విప‌రీత‌ధోర‌ణికి నిద‌ర్శ‌నంగా బీజేపీ ఆరోప‌ణ‌లు చేస్తోంది.

Also Read : Rahuls First Speech In Lok Sabha : మణిపూర్ లో భారత మాతను చంపారు.. కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్

గ‌త ఎన్నిక‌ల సంద‌ర్భంగా కోలార్ స‌భ‌లో మోడీ ఇంటి పేరుతో ఉన్న వాళ్లు దొంగ‌లు అంటూ కామెంట్ చేశారు. దానిపై గుజ‌రాత్ లోని సూర‌త్ కోర్టులో వాద‌ప్ర‌తివాద‌న‌లు జ‌రిగాయి. ఆ వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుగా భావిస్తూ రెండేళ్ల జైలు శిక్ష‌, జ‌రిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. దాని ప్ర‌కారం లోక్ స‌భ స‌చివాల‌యం రాహుల్ పై అన‌ర్హ‌త వేటు వేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. అయితే, సూర‌త్ కోర్టు తీర్పును స‌వాల్ చేస్తూ గుజ‌రాత్ హైకోర్టుకు రాహుల్ వెళ్లారు. కింద కోర్టు తీర్పును హైకోర్టు స‌మ‌ర్థించింది. దీంతో సుప్రీం కోర్టుకు వెళ్లారు రాహుల్. కింది కోర్టులు ఇచ్చిన తీర్పుల‌ను త‌ప్పుబడుతూ రాహుల్ కు సున్నిత మందలింపు ఇస్తూ స్టే ఇచ్చింది. దీంతో లోక్ స‌భ స‌చివాల‌యం రాహుల్ ను తిరిగి ఎంపీగా గుర్తిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. దీంతో ఆయ‌న గ‌త రెండు రోజులుగా లోక్ స‌భ‌కు హాజ‌ర‌వుతున్నారు. అవిశ్వాస తీర్మానం పై రెండో రోజు రాహుల్ ప్ర‌సంగించారు. ఆ త‌రువాత ఫ్లైయింగ్ కిస్  (Rahul Flying Kiss)ఇవ్వ‌డం వివాద‌స్ప‌దం అయింది.

Also Read : Rahul Gandhi: నా పేరు రాహుల్.. నా ఇల్లు ఇండియా

ప్ర‌స్తుతం ఫుటేజ్ ను ప‌రిశీలిస్తున్న లోక్ స‌భ అధికారులు, ఫ్లైయింగ్ కిస్ రాహుల్ ఇచ్చిన‌ట్టు గుర్తిస్తే మ‌రోసారి ఆయ‌న మీద వేటు త‌ప్ప‌ద‌ని లోక్ స‌భ‌లో భావిస్తున్నారు. స్పీక‌ర్ హోదాలో ఓం ప్ర‌కాష్ బిర్లా ఎలాంటి నిర్ణ‌యాన్నైనా తీసుకునే అవకాశం ఉంది. పైగా మంత్రి హోదాలో స్మృతీ ఇరానీ ఫిర్యాదు చేశారు. మ‌హిళా ఎంపీలు కూడా రాహుల్ ఫ్లైయింగ్ కిస్ మీద ఆగ్ర‌హంగా ఉన్నారు. మొత్తం మీద రాహుల్ కు గ‌త కొన్ని రోజులుగా పెరిగిన క్రేజ్ ఈ ఫ్లైయింగ్ కిస్ తో ఒక్కసారిగా ప‌డిపోనుంది. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండా, స్మృతి ఇరానీ మాట్లాడుతూ, “నాకు ముందు మాట్లాడిన వ్యక్తి తప్పుగా ప్రవర్తించాడు. `మహిళా పార్లమెంటేరియన్‌లకు స్త్రీ ద్వేషపూరిత పురుషుడు మాత్రమే ఫ్లయింగ్ కిస్ ఇవ్వగలడు. ఇది అతను ప్ర‌వ‌ర్త‌న అతని కుటుంబం మరియు పార్టీ మహిళల గురించి ఏమనుకుంటున్నాయో చూపిస్తుంది” అని అన్నారు. స్మృతి ఇరానీ అన్నారు.