Rahul Counter to Modi : ‘మోదీ జీ.. మీరు భయపడుతున్నారా’..? రాహుల్ కౌంటర్

గత ఐదేళ్లుగా రాహుల్ గాంధీ పదే పదే అదానీ, అంబానీలపై విమర్శలు గుప్పిస్తూ వచ్చాడు..ఇక తీరా ఎన్నికల నామినేషన్ మొదలు కాగానే మౌనం వహించాడని..ఎందుకు మౌనం పాటిస్తున్నాడో చెప్పాలని మోడీ రాహుల్ ను డిమాండ్ చేసారు

  • Written By:
  • Publish Date - May 9, 2024 / 10:35 PM IST

లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) ప్రచారంలో బిజెపి – కాంగ్రెస్ (BJP-Congress)పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మరోసారి బిజెపి సర్కార్ రాబోతుందని..400 సీట్లు సాదించబోతుందని మోడీ ధీమా వ్యక్తం చేస్తుంటే..ఈసారి కాంగ్రెస్ పార్టీదే విజయం అని ఇటు కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో నిన్న వేములవాడ సభ (Vemulawada Sabha)లో మోడీ మాట్లాడుతూ(Modi Speech)..రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఫై పలు కీలక వ్యాఖ్యలు చేసారు. గత ఐదేళ్లుగా రాహుల్ గాంధీ పదే పదే అదానీ, అంబానీ (Adani-Ambani)లపై విమర్శలు గుప్పిస్తూ వచ్చాడు..ఇక తీరా ఎన్నికల నామినేషన్ మొదలు కాగానే మౌనం వహించాడని..ఎందుకు మౌనం పాటిస్తున్నాడో చెప్పాలని మోడీ రాహుల్ ను డిమాండ్ చేసారు. అంతే కాదు అదానీ, అంబానీ నుంచి ఎన్ని టెంపో లోడ్ల ధనం ముట్టింది..? ఏం ఒప్పందం కుదిరింది..? రాత్రికి రాత్రే అంబానీ, అదానీలపై ఆరోపణలు ఆగిపోయాయి’ అని కీలక ఆరోపణలు చేసారు.

మోడీ వ్యాఖ్యలకు రాహుల్ కౌంటర్ (Rahul COunter) ఇచ్చాడు. అంబానీ, అదానీలు డబ్బు పంపుతున్నారంటూ వ్యక్తిగత అనుభవం దృష్ట్యా మాట్లాడుతున్నారా..? అని మోదీ జీ అంటూ రాహుల్ ప్రశ్నించారు. ‘మోదీ జీ.. మీరు భయపడుతున్నారా..? సాధారణంగా మీరు అదానీ, అంబానీల గురించి పబ్లిక్ గా మాట్లాడరు కదా.. డోర్లు మూసి ఉన్నప్పుడే వారి గురించి మాట్లాడతారు. కానీ ఫస్ట్ టైం మీరు పబ్లిక్ మీటింగ్ వారి గురించి మాట్లాడారు. వారు టెంపోల నిండా డబ్బులుపంపుతారని మీకు తెలుసు. అది మీ వ్యక్తిగత అనుభవమా..?’ అని రాహుల్‌ ప్రశ్నించారు. అలాగే ఆ ఇద్దరి వద్దకు ఈడీ, సీబీఐలను పంపించి వీలైనంత త్వరగా విచారణ జరిపించండి అంటూ రాహుల్‌ సెటైర్ వేశారు. బీజేపీ అవినీతి టెంపోకు డ్రైవర్‌ ఎవరో, హెల్పర్‌ ఎవరో దేశం మొత్తానికి తెలుసునన్నారు. ఈ మేరకు 46 సెకన్ల నిడివిగల వీడియోను రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

వాస్తవానికి రాహుల్ ఎన్నికల నామినేషన్ వచ్చినప్పటి నుండి తన ప్రతి ప్రసంగంలో , సభలో , సమావేశంలో..ఎక్కడైనా సరే.. అదానీ మరియు ముఖేష్ అంబానీ గురించి ప్రస్తావిస్తూనే వస్తున్నాడు. అయినప్పటికీ ప్రధాని మోదీ..రాహుల్ వారి పేర్లను పలకడం లేదని చెప్పడం హాస్యాస్పదం. ఇక రాహుల్ ఎన్నిసార్లు..అదానీ మరియు ముఖేష్ అంబానీల గురించి ప్రస్తావించాడో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఏప్రిల్ 19 నుండి ఈరోజు (మే 9) వరకు కూడా ప్రతి సభల్లో మోదీ..దేశ ప్రజల సొమ్మును అదానీ మరియు ముఖేష్ అంబానీలకు కట్టబెడుతూనే ఉన్నారని ప్రస్తావిస్తూనే వస్తున్నారు.

ఏప్రిల్ 20న రాహుల్ గాంధీ బీహార్‌లోని భాగల్‌పూర్‌లో బహిరంగ సభలో ప్రసంగించారు. ‘అంబానీ-అదానీ’ ల వద్ద అపారమైన సంపద ఉందని, పేదలు, రైతులు మరియు కూలీలకు చెప్పుకోదగ్గ ఆదాయం లేదని ఆయన అన్నారు. అంబానీ-అదానీల సంపదను ప్రధాని మోదీకి ఆపాదించారు అని చెప్పుకొచ్చారు. అదే రోజు ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో జరిగిన సమావేశంలోను ప్రసంగించారు. దేశంలోని విమానాశ్రయాలు, ఓడరేవులు, గనులు, విద్యుత్‌, రక్షణ రంగాలపై గౌతమ్‌ అదానీ గ్రూప్‌ నియంత్రణ ఎలా ఉందో రాహుల్‌ గాంధీ ప్రస్తావించారు.

ఏప్రిల్ 24న, మహారాష్ట్రలోని షోలాపూర్‌లో జరిగిన ర్యాలీలో రాహుల్ ప్రసంగిస్తూ.. అంబానీ-అదానీలకు వ్యతిరేకంగా మాట్లాడారు.

ఏప్రిల్ 26న, కర్ణాటకలోని బీజాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ.. విమానాశ్రయాలు, పోర్టులు, సోలార్ పవర్ వంటి రంగాల కాంట్రాక్టులన్నీ ‘అదానీ లాంటి వాళ్లకు’ అప్పగించి ధనికులు మరింత ధనవంతులు కావడానికి ప్రధాని మోదీ సహకరించారన్నారు.

ఏప్రిల్ 28న ఒడిశాలోని కేంద్రపరాలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఒడిశా ప్రజల నియంత్రణ మరియు డబ్బు అదానీకి ఎలా ఇవ్వబడిందో పేర్కొన్నాడు. దీన్ని ప్రధాని మోదీ, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ చేశారని ఆయన చెప్పడం జరిగింది. అదే రోజు డామన్ మరియు డయ్యూలో ప్రజలతో రాహుల్ మాట్లాడారు. అక్కడ కూడా తన ప్రసంగంలో వీరిద్దరి పేర్లను ప్రస్తావించారు.

ఏప్రిల్ 29న, గుజరాత్‌లోని పటాన్‌లో ఏర్పాటు చేసిన సభలో రాహుల్ మాట్లాడుతూ.. 70 కోట్ల మంది భారతీయులకు ఉన్నంత సంపద అదానీ, అంబానీ వంటి వారు కలిగి ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అదే రోజున ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో గాంధీ మాట్లాడుతూ.. బిజెపి సిద్ధాంతం కొంతమందికి సహాయం చేయడమేనని అన్నారు. అంబానీ-అదానీ లాంటి వారికి ఈ దేశ సంపద, భూమి, అడవులు ఇవ్వడమే బిజెపి సిద్ధాంతమని చెప్పుకొచ్చారు.

ఏప్రిల్ 30న, మధ్యప్రదేశ్ (MP)లోని భింద్‌లో జరిగిన ర్యాలీలో గాంధీ మాట్లాడారు. దేశంలోని అన్ని రంగాలలోకి కేవలం రెండు నుండి ముగ్గురు “అరబ్బాటీలు” మాత్రమే ఎలా ప్రవేశిస్తారో ప్రస్తావించాడు. అదానీకి రైల్వేలు, సోలార్ పవర్, రోడ్లు, విద్యుత్తు ఉన్నాయని గాంధీ తెలిపాడు. అంబానీ-అదానీ లాంటి వారి కోసం మోదీ వ్యవసాయ చట్టాలు రూపొందించారని పేర్కొన్నాడు.

We’re now on WhatsApp. Click to Join.

మే 2న కర్ణాటకలోని శివమొగ్గలో ప్రజలనుద్దేశించి రాహుల్ మాట్లాడారు. ప్రభుత్వం ప్రజల సొమ్మును తీసుకుని అంబానీ, అదానీ వంటి కొందరి జేబులు నింపిందని అన్నారు.

మే 3న మహారాష్ట్రలోని పూణేలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ.. దేశంలోని మీడియాను గౌతమ్ అదానీ నియంత్రిస్తున్నారని, రైతుల ఆత్మహత్యలు, ద్రవ్యోల్బణం మరియు దేశంలోని వ్యవసాయ దుస్థితి వంటి అంశాలను ఇందులో చూపించడం లేదని ఆయన పేర్కొన్నారు. మీడియా ప్రజలది కాదని, అది అదానీకి చెందినదని, అందుకే పారిశ్రామికవేత్తలు ఏది చెబితే అది చేస్తారని రాహుల్ అన్నారు.

మే 5న తెలంగాణలోని గద్వాల్‌లో రాహుల్ గాంధీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గత పదేళ్ల బీజేపీ పాలనలో ప్రధాని మోదీ ఏం చేసినా దేశంలోని ‘అంబానీల కోసమేనని గాంధీ పేర్కొన్నారు. అదానీని ప్రస్తావిస్తూ, ఆయనలాంటి వారి కోసమే ప్రధాని మోదీ తమ రుణాలను వదులుకుని దేశంలోని విమానాశ్రయాలు, పరిశ్రమలపై నియంత్రణ ఇచ్చారని అన్నారు. రైతులు, కూలీల రుణాలను బీజేపీ ప్రభుత్వం వదలడం లేదని తెలిపారు.

మే 6న మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి రాహుల్ గాంధీ తన ప్రసంగంలో .. రాజ్యాంగాన్ని రద్దు చేస్తే ప్రజల హక్కులన్నీ కనుమరుగవుతాయని, నాశనం అవుతాయన్నారు. మీ భూమి, మీ నీరు, మీ అడవులు, రిజర్వేషన్లు, ప్రభుత్వ రంగాలు అన్నీ కనుమరుగై భారతదేశాన్ని 22-25 మంది పాలిస్తారు. అదానీ లాంటి వాళ్ల కళ్లు మీ భూమి, అడవి, నీళ్లపై ఉన్నాయని అన్నారు.

ఈరోజు కూడా తెలంగాణలోని నర్సాపూర్ , సరూర్ నగర్ లో జరిగిన జన జాతర సభల్లోనూ అదానీ – అంబానీ లపై ఆరోపణలు చేసారు. ఇలా రాహుల్ తన ప్రతి సభలో , ర్యాలీ లో అంబానీ-అదానీల గురించి ప్రస్తావిస్తూ ఉంటె..రాహుల్ వారి గురించి మాట్లాడడం లేదని చెప్పడం ఫై అంత నవ్వుకుంటున్నారు.

Read Also : Molestation Case : మహిళా వేధింపుల కేసు.. CCTV ఫుటేజీలో ఎక్కడా కనిపించని గవర్నర్‌..