Site icon HashtagU Telugu

India Win : భారత్‌కు దౌత్య విజయం.. ఖతర్‌ జైలు నుంచి 8 మంది నేవీ మాజీ అధికారులు రిలీజ్

Qatar

Qatar

India Win : దౌత్యంలో భారత్ మరో విజయం సాధించింది. ఇజ్రాయెల్ కోసం గూఢచర్యం చేశారనే ఆరోపణలపై ఖతర్‌ జైల్లో మగ్గుతున్న ఎనిమిది మంది భారత నేవీ మాజీ అధికారులకు ఎట్టకేలకు కటకటాల నుంచి విముక్తి  లభించింది. భారత్ దౌత్య ప్రయత్నాలు సఫలం కావడంతో ఖతర్ ప్రభుత్వం ఆ ఎనిమిది మందిని జైలు నుంచి రిలీజ్  చేసింది. భారత విదేశాంగ శాఖ  సోమవారం ఈ విషయాన్ని ప్రకటించింది. విడుదలైన 8 మందిలో ఏడుగురు ఇప్పటికే ఇండియాకు తిరిగొచ్చేశారని వెల్లడించింది. భారత నేవీ వెటరన్‌లపై వారి కుటుంబాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వారంతా ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join

ఖతర్ రాజు నిర్ణయం అభినందనీయం : భారత్

‘‘ఖతర్‌ జైలు నుంచి ఎనిమిది మంది భారతీయ పౌరులను విడుదల చేయడాన్ని భారత ప్రభుత్వం స్వాగతిస్తోంది. ఆ ఎనిమిది మందిలో ఏడుగురు భారతదేశానికి ఇప్పటికే తిరిగి వచ్చారు. ఖతర్ రాజు నిర్ణయాన్ని మేం అభినందిస్తున్నాం’’ అని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

Also Read : Sleeping: నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా.. అయితే స్నానం చేస్తే నీటిలో ఇది కలవాల్సిందే?

ప్రధాని మోడీ వల్లే రిలీజయ్యాం 

అసలేం జరిగింది ? ఏమిటీ కేసు ?