Site icon HashtagU Telugu

Qatar Court – India : ఖతర్‌లో భారత్ న్యాయపోరాటం.. 8 మంది మాజీ సైనికులకు మరణశిక్షపై కీలక ఆర్డర్స్

Indian Navy Recruitment

Ex Navy Officer Vizag Qatar

Qatar Court – India : ఎనిమిది మంది మాజీ భారత నేవీ సిబ్బందికి మరణశిక్ష విధిస్తూ ఖతర్ కోర్టు ఇచ్చిన తీర్పుపై భారత ప్రభుత్వం జరుపుతున్న న్యాయపోరాటం దిశగా తొలి అడుగు పడింది. ఆ తీర్పును వ్యతిరేకిస్తూ భారత ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ పిటిషన్‌ను ఖతర్ కోర్టు అంగీకరించింది. దాన్ని విచారణకు స్వీకరించేందుకు అనుమతి మంజూరు చేసింది. దీనిపై విచారణకు ఒక తేదీని త్వరలోనే కేటాయిస్తామని వెల్లడించింది.

We’re now on WhatsApp. Click to Join.

అసలేం జరిగింది ? మనవాళ్లు  ఏం చేశారు ?

దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో ఎనిమిది మంది మాజీ భారత నేవీ సిబ్బంది దాదాపు గత ఆరేళ్ల పాటు ఉద్యోగాలు చేశారు. ఇటలీ డిఫెన్స్ టెక్నాలజీతో ఖతర్ రహస్యంగా జలాంతర్గాములను నిర్మిస్తోంది. ఈ నిర్మాణ ప్రాజెక్టులో పనిచేసే ఖతర్ సాయుధ దళాలకు మాజీ భారత నేవీ సిబ్బంది ట్రైనింగ్ ఇచ్చేవారు. ఈక్రమంలోనే వారంతా ఇజ్రాయెల్ ఆర్మీ కోసం గూఢచర్యం చేశారని, ఖతర్ జలాంతర్గాముల సమాచారాన్ని ఇజ్రాయెల్‌కు అందించారనే ఆరోపణలు వచ్చాయి.

Also Read: 30 Elephants Entry : 30 ఏనుగుల ఎంట్రీ.. పది గ్రామాల్లో హై అలర్ట్

దీంతో 2022 ఆగస్టులో వారిని అరెస్టు చేసి జైలులో ఉంచి పోలీసు విచారణ చేశారు.  ఇక న్యాయ విచారణ 2023 మార్చిలో మొదలైంది.  గత నెలలోనే కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్ వశిష్ట్, సీడీఆర్ అమిత్ నాగ్‌పాల్, సీడీఆర్ పూర్ణేందు తివారీ, సీడీఆర్ సుగుణాకర్ పాకాల, సీడీఆర్ సంజీవ్ గుప్తా, సెయిలర్ రాగేశ్‌లకు మరణశిక్ష విధిస్తూ ఖతర్‌లోని కోర్టు ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ తీర్పు ఇచ్చింది. ఈ శిక్షపై భారతదేశం అప్పీల్ దాఖలు చేసింది. మాజీ నేవీ అధికారులను స్వదేశానికి పంపాలని ఖతర్‌ను(Qatar Court – India) అభ్యర్థించింది.