PM Modi: మా దేశాల్లో పర్యటించండి…మోడీకి పుతిన్‌, జెలెన్‌స్కీ ఆహ్వానం

  • Written By:
  • Publish Date - March 21, 2024 / 11:16 AM IST

 

Narendra Modi: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం(Russia-Ukraine War)నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ(pm modi) బుధవారం ఇరు దేశాధినేతలతో మాట్లాడారు. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్(Russian President Putin), ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ(Zelensky, President of Ukraine) ప్రధానిని ఎన్నికల తర్వాత(After election) తమ దేశాల్లో పర్యటించాలని ఆహ్వానించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.

కాగా, పుతిన్, ‌జెలెన్‌స్కీతో సంభాషణ గురించి మోడీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎన్నికల్లో మరోసారి గెలిచిన పుతిన్‌కు శుభాకాంక్షలు తెలిపానన్నారు. భవిష్యత్తులో ఇరు దేశాల బంధం మరింత బలపడాలని, కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, భారత్-ఉక్రెయిన్ బంధం బలోపేతం చేయడంపై అధ్యక్షుడు జెలెన్‌స్కీతో చర్చించానని మోడీ మరో పోస్టులో తెలిపారు. ప్రస్తుతం యుద్ధం ముగింపునకు, శాంతిస్థాపనకు తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. ప్రజల అవసరాలే లక్ష్యంగా భారత్ మానవతాసాయం కొనసాగిస్తుందని హామీ ఇచ్చినట్టు తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులు, వైమానికరంగంలో సహకారం, ఫార్మాస్యూటికల్స్ వంటి రంగాల్లో భారత్‌తో ఆర్థిక, వ్యాపార సంబంధాలు బలోపేతం చేసేందుకు ఉక్రెయిన్ ఆసక్తిగా ఉందని జెలెన్‌స్కీ చెప్పినట్టు మోడీ అన్నారు. భారతీయ వైద్య విద్యార్థులకు ఉక్రెయిన్ ఆహ్వానం పలుకుతున్నట్టు కూడా ఆయన చెప్పారు.

read also: IPL New Rule: ఐపీఎల్‌లో కొత్త రూల్‌.. ఇంత‌కీ ఏమిటి ఆ న్యూ రూల్‌..!