Women of the Year : పూర్ణిమా దేవి.. టైమ్‌ మేగజైన్‌ ‘విమెన్ ఆఫ్‌ ది ఇయర్‌’.. ఎవరామె ?

‘హర్‌గిలా ఆర్మీ’  గురించి,  పూర్ణిమాదేవి బర్మన్‌‌(Women of the Year) గురించి..  ఫ్రాన్స్, కంబోడియా దేశాల్లోని స్కూళ్లలో పాఠాలు చెబుతున్నారు.

Published By: HashtagU Telugu Desk
Purnima Devi Barman Women Of The Year Time Magazine Assam Hargila Army Wildlife Conservationist

Women of the Year : పూర్ణిమాదేవి బర్మన్‌..  2025 సంవత్సరం కోసం ‘టైమ్‌ మేగజైన్‌’ వెలువరించిన ‘విమెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ జాబితాలో చోటును సంపాదించారు. ఈ లిస్టులో వివిధ దేశాలకు చెందిన 13 మంది మహిళలకు చోటు దక్కింది. ఇందులో మన భారతదేశం నుంచి చోటు పొందిన ఏకైక మహిళ పూర్ణిమ మాత్రమే. ఇంతకీ ఈమె ఎవరు ? పూర్ణిమాదేవికి ఎందుకీ ఘనత దక్కింది ? ఈ కథనంలో తెలుసుకుందాం.

Also Read :Warangal Bloodshed : ఓరుగల్లులో కత్తుల కల్చర్.. రాజలింగ మూర్తి హత్య తర్వాత వరుస రక్తపాతాలు

పూర్ణిమాదేవి బర్మన్‌ నేపథ్యం.. 

  • 45 ఏళ్ల పూర్ణిమాదేవి బర్మన్‌  అస్సాం వాస్తవ్యురాలు.
  • ఆమెకు చిన్నప్పటి నుంచి ప్రకృతి, పక్షులు అంటే చాలా ఇష్టం. అందుకే పూర్ణిమ జువాలజీలో పీజీ చేసింది.
  • అసోం రాష్ట్రంలో ఉండే గ్రేటర్‌ అడ్జటంట్‌ జాతికి చెందిన పెద్ద కొంగలపై పీహెచ్‌డీ చేయాలని అనుకున్నారు.
  • గ్రేటర్‌ అడ్జటంట్‌ జాతి పెద్ద కొంగలు అంతరించిపోవడాన్ని పూర్ణిమ గుర్తించారు. వాటి సంరక్షణకు ప్రయత్నించాలని ఆమె నిర్ణయించుకున్నారు.
  • గ్రేటర్‌ అడ్జటంట్‌ జాతి పెద్ద కొంగలను సంరక్షించేందుకు 2007 సంవత్సరంలో కొందరు మహిళలతో కలిసి ‘హర్‌గిలా ఆర్మీ’  (Hargila Army) అనే బృందాన్ని పూర్ణిమాదేవి బర్మన్‌  ఏర్పాటు చేశారు.
  • అసోం రాష్ట్రంలో 2007 సంవత్సరం నాటికి గ్రేటర్‌ అడ్జటంట్‌ జాతి పెద్ద కొంగలు 450 మాత్రమే ఉండేవి.
  • పూర్ణిమాదేవి బర్మన్‌‌కు చెందిన ‘హర్‌గిలా ఆర్మీ’ చేసిన ప్రయత్నాలు ఫలించడం వల్ల 2023 నాటికి గ్రేటర్‌ అడ్జటంట్‌ జాతి పెద్ద కొంగల సంఖ్య ఏకంగా 1800 దాటింది.  ఈవివరాలను ‘టైమ్‌ మేగజైన్‌’  నివేదికలో ప్రస్తావించారు.
  • ‘హర్‌గిలా ఆర్మీ’  గురించి,  పూర్ణిమాదేవి బర్మన్‌‌(Women of the Year) గురించి..  ఫ్రాన్స్, కంబోడియా దేశాల్లోని స్కూళ్లలో పాఠాలు చెబుతున్నారు.
  • గ్రేటర్‌ అడ్జటంట్‌ జాతి పెద్ద కొంగలను అసోం రాష్ట్ర కల్చర్‌లో భాగంగా పరిగణిస్తారు.
  • ప్రస్తుతం  పూర్ణిమకు చెందిన ‘హర్‌గిలా ఆర్మీ’లో  దాదాపు 20 వేల మంది మహిళలు ఉన్నారు. వీరంతా కొంగలపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. అస్సాం సంప్రదాయ దుస్తులపై కొంగ బొమ్మలు గీసి అక్కడికి వచ్చిన పర్యాటకులకు విక్రయిస్తుంటారు. దీనివల్ల  వారికి జీవనోపాధి లభిస్తుంది.

Also Read :Pawan Kalyan : పవన్‌ కళ్యాణ్‌పై అనుచిత పోస్ట్‌.. కేసు నమోదు

  Last Updated: 21 Feb 2025, 01:06 PM IST