Site icon HashtagU Telugu

National Highway : పంజాబ్ – లుథియానా హైవే పై ప్రమాదం.. ట్రక్కులు, లారీలు ధ్వంసం

punjab - ludhiana national highway

punjab - ludhiana national highway

National Highway : ఢిల్లీలో వాయుకాలుష్యం రోజు రోజుకూ కలవరపాటుకు గురిచేస్తోంది. శీతాకాలం పెరుగుతున్న కొద్దీ.. గాలిలో నాణ్యత క్రమంగా పడిపోతుంది. దీపావళి తర్వాత ఢిల్లీ సహా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వాయుకాలుష్య కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. తెల్లవారుజామున పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. వాయుకాలుష్యంతో పాటు పొగమంచు పెరుగుతుండటంతో.. విజిబులిటీ తగ్గిపోయి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. పంజాబ్ లోనూ ఢిల్లీ తరహా పరిస్థితులే ఉన్నాయి. ఆదివారం తెల్లవారుజామున పంజాబ్ – లుథియానా హైవేపై పెద్ద ప్రమాదం జరిగింది.

పొగమంచు, వాయుకాలుష్యం ఎక్కువగా ఉండటంతో.. ఎదురుగా ఉన్న వాహనం కనిపించక హైవేపై పదుల సంఖ్యలో వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ట్రక్కులు, లారీలతో పాటు కార్లు కూడా ధ్వంసమయ్యాయి. ప్రమాదం కారణంగా నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ప్రమాదానికి గురైన వాహనాలను తొలగించి.. ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు. మరోవైపు.. వాయుకాలుష్యం కారణంగా ప్రజలు వాకింగ్ చేసేందుకు జంకుతున్నారు.