Punjab: జూన్ 7న 10 చోట్ల పేలుళ్లు.. మిస్టరీని ఛేదించే పనిలో పంజాబ్ పోలీసులు.. అందర్నీ చంపేస్తామని బెదిరింపు లేఖలు

జూన్ 7వ తేదీన పంజాబ్‌ (Punjab)లోని భటిండా జిల్లాలో బాంబు పేలుళ్లు (Blasts) జరిగే అవకాశం ఉంది. ఎస్‌ఎస్పీ గుర్నీత్ ఖురానా జిల్లా మొత్తం పోలీస్ స్టేషన్‌లను అప్రమత్తం చేశారు.

  • Written By:
  • Publish Date - May 20, 2023 / 09:13 AM IST

Blasts: జూన్ 7వ తేదీన పంజాబ్‌ (Punjab)లోని భటిండా జిల్లాలో బాంబు పేలుళ్లు (Blasts) జరిగే అవకాశం ఉంది. ఎస్‌ఎస్పీ గుర్నీత్ ఖురానా జిల్లా మొత్తం పోలీస్ స్టేషన్‌లను అప్రమత్తం చేశారు. జిల్లాలోని ప్రతి కూడలిలో గట్టి నిఘా ఉంచాలని ఎస్‌ఎస్పీ ఖురానా ఆదేశించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. అంతే కాకుండా జిల్లాలో జరిగే ప్రతి కార్యకలాపాన్ని పర్యవేక్షించాలన్నారు. 6 లేఖల ద్వారా జూన్ 7న బ్లాస్టింగ్ గురించి చర్చ జరిగింది. ఈ లేఖలు అందడంతో పోలీసు యంత్రాంగంలో కలకలం రేగింది.

ఈ 6 లేఖలు రాజకీయ నాయకులు, అధికారులు, వ్యాపారవేత్తలకు పంపబడ్డాయి. అందులో ఒక కాపీ అసలైనది. మిగిలినవి ఫోటోకాపీలు. పోస్ట్‌మ్యాన్ ద్వారా ఈ 6 లేఖలు రాజకీయ నేతలు, అధికారులు, వ్యాపారుల ఇళ్లకు చేరాయని ఎస్‌ఎస్పీ గుర్నీత్ ఖురానా చెప్పారు. ఎస్‌ఎస్పీ గుర్నీత్ ఖురానా తెలిపిన వివరాల ప్రకారం.. పేలుడు జరిగే ప్రదేశం కూడా ఈ లేఖల్లో రాసి ఉంది. జూన్ 7న ఈ 10 చోట్ల పేలుళ్లు జరుపుతామని రాశారు. దీని కోసం సామగ్రి కూడా పంపిణీ చేశాం. దేవుడు మాత్రమే ఇప్పుడుభటిండా ను రక్షించగలడు. పంజాబ్‌లో హిందువులు, ముస్లింలను ఎవరినీ బతకనివ్వబోమని, ఎవరైనా ఆపగలిగితే ఆపేస్తామని కూడా ఈ లేఖల్లో రాశారు.

Also Read: Gali Ravikanth : రాష్ట్ర బాస్కెట్ బాల్ మాజీ ప్లేయ‌ర్ గాలి ర‌వికాంత్ మృతి

ఈ పేలుళ్లు ఎక్కడ జరుగుతాయో కూడా పేర్కొన్నారు. హిస్టారికల్‌ ఖిలా ముబారక్‌, రైల్వేస్టేషన్‌, ఆదేశ్‌ హాస్పిటల్‌, ఎస్‌ఎస్‌పీ కార్యాలయం, సెంట్రల్‌ జైలు, ఐటీఐ, ఆయిల్‌ డిపో జస్సీ, నిరంకారీ భవన్‌, మిట్టల్‌ మాల్‌, కొత్త కార్‌ పార్కింగ్‌లను లక్ష్యంగా చేసుకోనున్నారు.

ఈ మేరకు పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు

జిల్లావ్యాప్తంగా ఎక్కడైనా అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్‌ఎస్పీ గుర్నీత్ ఖురానా తరపున ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల అమృత్‌సర్‌లోని హెరిటేజ్ స్ట్రీట్ సమీపంలో మూడు పేలుళ్లు జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఈ కేసులో ప్రధాన సూత్రధారి సహా ఐదుగురు నిందితులను పట్టుకోవడంలో పంజాబ్ పోలీసులు విజయం సాధించారు. ఇప్పుడు బెదిరింపు లేఖలు రావడంతో పోలీసుల ఆందోళన మరింత పెరిగింది. జూన్ 3 నుండి 6 వరకు పంజాబ్‌లో ఘల్లుఘర దినోత్సవాన్ని జరుపుకుంటారు.