Punjab CM : 51 ఏళ్ల ఏజ్‌లో తండ్రయిన పంజాబ్ సీఎం.. రెండో భార్యకు ఆడశిశువు

Punjab CM : పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ గురువారం గుడ్ న్యూస్ విన్నారు.

Published By: HashtagU Telugu Desk
Punjab Cm

Punjab Cm

Punjab CM : పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ గురువారం గుడ్ న్యూస్ విన్నారు. ఆయన రెండో భార్య డాక్టర్‌ గురుప్రీత్‌ కౌర్‌ ఆడశిశువుకు జన్మనిచ్చారు. తాను తండ్రినయ్యాననే విషయాన్ని ట్విట్టర్ వేదికగా సీఎం మాన్ అనౌన్స్ చేశారు. మొహాలీలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో గురుప్రీత్ కౌర్‌కు ప్రసవం జరిగిందని, తల్లిబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని ఆయన(Punjab CM) వెల్లడించారు.

We’re now on WhatsApp. Click to Join

పంజాబ్ సీఎం హోదాలో ఉండగా తండ్రి అయిన తొలి నాయకుడిగా 51 ఏళ్ల భగవంత్‌ మాన్‌ నిలిచారు. డాక్టర్ గురుప్రీత్ కౌర్‌ను రెండేళ్ల క్రితమే మాన్ రెండో పెళ్లి చేసుకున్నారు. పంజాబ్ సీఎం నుంచి విడాకులు తీసుకున్న మాజీ భార్యకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిద్దరూ కెనడాలో సెటిల్ అయ్యారు.

Also Read :Common Capital: అద్దె చెల్లిస్తారా.. ఖాళీ చేస్తారా..?

భగవంత్ మాన్ మ్యారేజ్ లైఫ్

  • సీఎం భగవంత్ మాన్ రాజకీయాల్లోకి రాకముందు వ్యాపారం, క్రీడలు, రాజకీయ అంశాలపై కామెడీ ప్రోగ్రామ్స్ చేసేవారు.
  • 2008లో గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్‌లోనూ ఆయన పాల్గొన్నారు.
  • పంజాబ్ ముఖ్యమంత్రి కాకముందే.. 2016 సంవత్సరంలో భగవంత్ మాన్ తన మొదటి భార్య ఇంద్రప్రీత్ కౌర్ నుంచి విడిపోయారు.
  • 2022 మార్చిలో భగవంత్ మాన్ పంజాబ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కెనడాలో స్థిరపడిన మొదటి భార్య పిల్లలిద్దరూ సీఎంగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.
  • 2022 జూలై 7న డాక్టర్ గురుప్రీత్ కౌర్‌ను మాన్ పెళ్లాడారు.
  • గురుప్రీత్ కౌర్‌,  భగవంత్ మాన్  ఇద్దరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్.
  • కురుక్షేత్ర జిల్లా పెహోవా పట్టణానికి చెందిన గురుప్రీత్ ఒక వైద్యురాలు.
  • ఆమె వయసు దాదాపు 34 ఏళ్లు. కౌర్ తండ్రి ఇంద్రజిత్ సింగ్ ఒక రైతు, ఆమె తల్లి మాతా రాజ్ కౌర్ గృహిణి.

Also Read : Sleeping On Currency : కరెన్సీ నోట్లతో పొలిటీషియన్ నిద్ర.. ఫొటోలు వైరల్

సీఎం మాన్ కుమార్తె  సంచలన వ్యాఖ్యలు

పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కుమార్తె, మొదటి భార్య కూతురు సీరత్ కౌర్ మాన్ 2023 డిసెంబరులో ట్విట్టర్ (ఎక్స్) వేదికగా సంచలన వీడియోను పోస్ట్ చేశారు. ‘‘నేను సీఎం మాన్ కుమార్తెను. అయితే నాన్న అని పిలిపించుకునే హక్కును ఆయన కోల్పోయారు. అందుకే ఆయన్ను సీఎం మాన్ అని పిలుస్తున్నాను. మా కుటుంబాన్ని సీఎం మాన్ పట్టించుకోలేదు. మేం మౌనంగా ఉండబట్టే.. ఆయన సీఎం అయ్యారు. సీఎం రెండో భార్య ప్రస్తుతం గర్భంతో ఉన్నారట. సీఎం మాన్ మూడోసారి తండ్రి కాబోతున్నాడు’’ అని ఆ వీడియోలో సీరత్ కౌర్ మాన్ పేర్కొన్నాడు.

Also Read : Chandrachud : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ

  Last Updated: 28 Mar 2024, 04:34 PM IST