Kejriwal : జైల్లో కేజ్రీవాల్‌ని కలిసిన పంజాబ్ సీఎం భగవంత్‌ మాన్‌

Arvind Kejriwal: ఢీల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో తీహార్ జైల్లో(Tihar Jail) ఉన్న విషయం తెలిసిందే. అయితే కేజ్రీవాల్‌ను కలిసేందుకు మంగళవారం పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌(Punjab CM Bhagwant Mann) తీహార్‌ జైల్‌కి వెళ్లి అక్కడ ఆయనను కలిసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..కేజ్రీవాల్ ఆరోగ్యంగానే ఉన్నారని, ఇన్సులిన్ తీసుకుంటున్నారని తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థుల గెలుపు కోసం చురుగ్గా ప్రచారం చేయాలని కేజ్రీవాల్ తమకు […]

Published By: HashtagU Telugu Desk
Punjab CM Bhagwant Mann meet Kejriwal in jail

Punjab CM Bhagwant Mann meet Kejriwal in jail

Arvind Kejriwal: ఢీల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో తీహార్ జైల్లో(Tihar Jail) ఉన్న విషయం తెలిసిందే. అయితే కేజ్రీవాల్‌ను కలిసేందుకు మంగళవారం పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌(Punjab CM Bhagwant Mann) తీహార్‌ జైల్‌కి వెళ్లి అక్కడ ఆయనను కలిసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..కేజ్రీవాల్ ఆరోగ్యంగానే ఉన్నారని, ఇన్సులిన్ తీసుకుంటున్నారని తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థుల గెలుపు కోసం చురుగ్గా ప్రచారం చేయాలని కేజ్రీవాల్ తమకు సూచించారన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రజలు తన గురించి ఎలాంటి ఆందోళన చెందక్కర్లేదని, ఎన్నికల సమయంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఢిల్లీ సీఎం విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. పంజాబ్‌లో గోధుమల ఉత్పత్తి, విద్యుత్ సరఫరా తదితర అంశాల గురించి కేజ్రీవాల్ తనను అడిగినట్లు చెప్పారు. పంజాబ్ ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిన 158 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్ క్లియర్ చేశారని చెప్పడంతో ఆ మాట విని ఎంతగానో సంతోషించినట్లు చెప్పారు. ఇటీవల తాను గుజరాత్లో పర్యటించిన విషయాన్ని కేజ్రీవాల్‌కి చెప్పానన్నారు. ప్రజలు ఓట్లు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని ప్రజలు ఆయన సందేశం ఇచ్చారన్నారు.

Read Also:Tamilisai : హైదరాబాద్ బీజేపీ పార్లమెంటు ఇన్‌ఛార్జిగా తమిళిసై

  Last Updated: 30 Apr 2024, 04:14 PM IST