Bhagwant Mann Hospitalised : సీఎం ఆరోగ్యంపై మూఢ‌న‌మ్మ‌కం

  • Written By:
  • Publish Date - July 21, 2022 / 02:59 PM IST

పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ క‌డుపునొప్పితో ఢిల్లీ ఆస్ప‌త్రిలో చేరారు. ఆయ‌న నొప్పికి కార‌ణం రెండు రోజుల క్రితం ప‌విత్ర న‌దిలోని క‌లుషిత నీళ్లంటూ పంజాబ్ ఆప్ ట్వీట్ చేసింది. ఆయ‌న క‌లుషిత నీళ్లు తాగిన వీడియో ఇప్పుడు వైర‌ల్ అవుతోంది.

ముఖ్యమంత్రి ఒక నది నుండి గ్లాసు నీటిని తీసి మద్దతుదారుల హర్షధ్వానాల మధ్య దానిని గుమ్మరించడం వీడియోలో చూడవచ్చు. ఆ వీడియో గత ఆదివారం నాటిది. ప్రఖ్యాత పర్యావరణవేత్త , రాజ్యసభ ఎంపీ బాబా బల్బీర్ సింగ్ `సీచెవాల్ కలి బీన్‌`ను శుద్ధి చేసిన 22వ వార్షికోత్సవంలో పాల్గొనవలసిందిగా ముఖ్యమంత్రిని ఆహ్వానించారు పంజాబ్‌లోని సుల్తాన్‌పూర్ లోధి వ‌ద్ద ఉన్న పవిత్ర నదిలోని కలుషితమైన నీటిని ఆయనకు అందించారు.పట్టణాలు, గ్రామాల నుంచి వచ్చే మురుగు వ్యర్థాలతో కూడిన ఆ నీటిని పంజాబ్ ముఖ్యమంత్రి నిరభ్యంతరంగా తాగారు. ఇప్పుడు అతను ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స కోసం చేరాడు.

ఆప్ పంజాబ్ యూనిట్ ట్వీట్ చేసిన వీడియోలో, “సీఎం @భగవంత్ మాన్ సుల్తాన్‌పూర్ లోధి వద్ద పవిత్ర జలం తాగుతున్నప్పుడు, గురునానక్ సాహిబ్ పాదాలు తాకిన భూమి, రాజ్యసభ సభ్యుడు సంత్ సిచెవల్ జీ పవిత్ర స్థలాన్ని శుభ్రపరిచే పనిని చేపట్టారు.` అని పొందుప‌రిచారు. నదులు, కాలువలను శుద్ధి చేసేందుకు ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ప్రకటించింది. “భగవంత్ మాన్ కూడా బీన్ నుండి నీరు తాగాను, ఈ అవకాశం లభించినందుకు తాను ఆశీర్వదించబడ్డానని చెప్పాడు” అని ట్వీట్లో ఆప్ జోడించింది.