Site icon HashtagU Telugu

Punjab: పంజాబీ భాష తెలిసినవారికే…ప్రభుత్వ ఉద్యోగాలు..పంజాబ్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం..!!

Punkab Cm

Punkab Cm

పంజాబ్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. పంజాబీ భాష మాట్లాడితేనే ప్రభుత్వ ఉద్యోగులకు అర్హులంటూ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అధ్యక్షతన చండీగడ్ లో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో గ్రూప్ సి, డి పోస్టులలో పంజాబీ భాషపై లోతైన పరిజ్ణానం ఉన్న అభ్యర్థులను మాత్రమే నియమించేలా చట్టంలో సవరణలను క్యాబినెట్ ఆమోదించింది.

ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అధ్యక్షణ చండీగఢ్ లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పంజాబ్, పంజాబీ, పంజాబియత్ ల తత్వాన్ని మరింత బలోపేతం చేయడమే దీని లక్ష్యమన్నారు. ఈ ప్రకటన అనంతరం పంజాబ్ సివిల్ సర్వీసెస్, రూల్స్, 1994 పంజాబ్ స్టేట్ సర్వీసెస్ రూల్స్, 1963లోని రూల్ 17కి సవరణలను కేబినెట్ ఆమోదించింది. పంజాబీ భాషపై లోతైన పరిజ్ణానం ఉన్నవారిని మాత్రమే పంజాబ్ ప్రభుత్వంలో నియమిస్తారు.

https://twitter.com/CMOPb/status/1583487836627832832?s=20&t=XEqzY1GWG2qU3ru4l_wt_g

Exit mobile version