Site icon HashtagU Telugu

No Water No Votes : ‘నో వాటర్.. నో ఓట్’.. రాజకీయ పార్టీలకు ఆ గ్రామస్తుల వార్నింగ్

No Water No Votes

No Water No Votes

No Water No Votes :  ఎన్నికలు వచ్చాయంటే రాజకీయ పార్టీలు, నాయకులు హామీల వర్షం కురిపిస్తుంటారు. గెలిచాక అవి చేస్తాం.. ఇవి చేస్తాం అంటూ వాగ్దానాలు ఇస్తుంటారు. ఈక్రమంలో కొన్నిచోట్ల ప్రజల నుంచి ప్రతిఘటన ఎదురవుతుంటుంది. గతంలో ఇచ్చిన హామీలకే దిక్కులేదంటూ నాయకులను ప్రజలు నిలదీసే దాఖలాలు కూడా అక్కడక్కడ వెలుగు చూస్తుంటాయి. ఇటువంటి పరిస్థితే ఇప్పుడు మహారాష్ట్రలోని పుణె సిటీ శివారులో ఉన్న ఖరేవాడి గ్రామంలో నెలకొంది.  ఈ ఊరిలోని దాదాపు 10వేల మంది ప్రజలు ఎన్నికలను బహిష్కరిస్తామని అన్ని పార్టీల నాయకులకు వార్నింగ్  ఇచ్చారు. నీటి  కొరత వల్ల తాము చాలా ఏళ్లుగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని.. ఎవరూ తమను పట్టించుకోవడం లేదన్నారు.  నీటి కటకట గురించి పలుమార్లు పుణె మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) అధికారులకు ఫిర్యాదు చేసినా సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపలేదని పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join

ఈనేపథ్యంలో రాజకీయ పార్టీల అభ్యర్థులకు తమ నిరసన గళాన్ని వినిపించేందుకు ఖరేవాడి గ్రామస్తులు ఒక వినూత్న ప్రయత్నం చేశారు. గ్రామంలోని అన్ని వీధుల్లో ‘నో వాటర్.. నో ఓట్’(No Water No Votes) నినాదంతో బ్యానర్లు కట్టారు. నీటి సమస్యను పరిష్కరించకుంటే ఎన్నికలను బహిష్కరిస్తామని స్థానికులు తేల్చి చెబుతున్నారు.  వారి హెచ్చరిక రాజకీయ పార్టీల నేతలను ఆందోళనకు గురిచేస్తోంది. మే 13న ఇక్కడి పుణె లోక్‌సభ స్థానం పరిధిలో ఎన్నికలు జరగనున్నాయి.

Also Read :Raashi Khanna: కొత్త ఇంటిని కొనుగోలు చేసిన రాశి ఖన్నా.. ప్రత్యేకమైన పూజలు?

ప్రతి ఏడాది వేసవిలో తమ ఊరికి నీటి కటకట ఇలాగే ఎదురవుతోందని.. ఏ పార్టీ కూడా పట్టించుకోవడం లేదని  ఖరేవాడి గ్రామస్తులు చెబుతున్నారు. ఏటా సమ్మర్ టైంలో చాలా రోజులు ట్యాంకర్ నీళ్లను తెప్పించుకొని  సరిపెట్టుకోవాల్సి  వస్తోందని అంటున్నారు.  తమ ఊరిలో నీటి సమస్యను పరిష్కరించే వరకు ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించుకున్నామని ఊరి ప్రజలు తెలిపారు.

Also Read :Satyavathi Rathod : పార్టీ మార్పుపై స్పందించిన సత్యవతిరాథోడ్