Pune: కొడుకు చనిపోయిన బాధలో కుటుంబం.. నిమజ్జనంతో ఇంటిముందు రచ్చ

గణేశ విగ్రహ నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా జరిగిన ఓ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది. కన్న కొడుకు చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబంపై దారుణంగా దాడి చేశారు.

Pune: గణేశ విగ్రహ నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా జరిగిన ఓ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది. కన్న కొడుకు చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబంపై దారుణంగా దాడి చేశారు. నిమజ్జనం సందర్భంగా బాధితుల ఇంటిగుండా ఊరేగింపుగా గణేషుడిని తీసుకెళ్తున్నారు. డీజే పాటలతో హోరెత్తించారు. అప్పటికే కొడుకుని పోగొట్టుకున్న పేరెంట్స్ ఆ సౌండ్స్ వాళ్ళని మరింత బాధకు గురి చేశాయి. దీంతో ఇంటి యజమాని వాళ్ళని సౌండ్ తగ్గించమని కోరగా వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కొందరు సదరు కుటుంబంపై ఎటాక్ చేశారు.

సెప్టెంబర్ 25వ తేదీ సోమవారం పూణెలో ఈ ఘటన చోటుచేసుకుంది. కుమారుడి మృతితో సునీల్ ప్రభాకర్ షిండేతో పాటు ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది. డప్పు చప్పుళ్లతో ఇంటి దగ్గరకు ఊరేగింపు వెళ్తుండగా.. కొడుకు మృతి చెందిన విషయాన్ని నిర్వాహకులకు సునీల్ తెలిపాడు. ఇంట్లో కొడుకు చనిపోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో ఉన్నారని, ఇంటిముందు డ్యాన్సులు ఆపాలని కోరారు.కానీ నిర్వాహకులు అందుకు ఒప్పుకోలేదు. గణేశ విగ్రహాన్ని నిమజ్జనం చేసిన అనంతరం తిరిగి వచ్చిన ముఠా ఇనుప రాడ్‌లతో కుటుంబసభ్యులపై దాడి చేశారు. సునీల్ షిండే, సోదరుడు, తల్లి, తండ్రి మరియు డ్రైవర్‌ను తీవ్రంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 21 మందిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Also Read: Chandrababu Arrest : నిరాహార దీక్ష కు సిద్దమైన నారా భువనేశ్వరి