ISRO : పీఎస్ఎల్వీ సీ 54 ప్రయోగం సక్సెస్…!!

  • Written By:
  • Publish Date - November 26, 2022 / 01:09 PM IST

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ శ్రీహరి కోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి నింగిలోకి ప్రవేశపెట్టిన PSLV C54 విజయవంతమైంది. ఈఓఎస్ 06, 8 చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి తీసుకెళ్లుందుకు దీనిని ప్రయోగించారు. సముద్రాలపై వాతావరణాన్ని అధ్యయనం చేసేందుకు ఉపయోగపడుతుంది. ఈ ప్రయోగం ద్వారా భారత్ కు చెంది 1117 కిలోల బరువు ఉన్న ఈఓఎస్ 06, అలాగే 18.28 కిలోల బరువున్న ఐఎన్ఎస్ 2బీ , 16.15 కీలలో బరువున్న ఆనంద్, 1.45 కిలోల బరువున్న రెండు థాయ్ బోల్ట్ షాటిలైట్స్ తోపాటుగా 17.92 కిలోల బరువున్న నాలుగు అమెరికాకు చెందిన యాస్ట్రో కాట్ ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపారు. శ్రీహరి కోట నుంచి ఇది 87వ ప్రయోగం.