Prudent Electoral Trust: బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రుడెంట్ ట్రస్ట్ రూ.880 కోట్ల విరాళాలు.. ఇది ఎవరిది ?

ప్రాచీన భారత రాజకీయాలను మనం పరిశీలిస్తే చాణక్యుడు కింగ్ మేకర్(Prudent Electoral Trust).. చంద్రగుప్త మౌర్యుడు కింగ్.

Published By: HashtagU Telugu Desk
Prudent Electoral Trust Donations To Bjp And Congress Adr National Parties

Prudent Electoral Trust: 2023-24 ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో అత్యధిక విరాళాలు ఏ రాజకీయ పార్టీకి వచ్చాయో తెలుసా ? బీజేపీకే వచ్చాయి. ఆ ఆర్థిక సంవత్సరంలో కమల దళానికి ఏకంగా రూ.2,243 కోట్లకుపైగా డొనేషన్లు అందాయి. రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్‌కు రూ.281.48 కోట్ల విరాళాలు వచ్చాయి. బీజేపీ ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్నందున దేశవ్యాప్తంగా కార్పొరేట్ కంపెనీల నుంచి పెద్ద  మొత్తంలోనే విరాళాలను సేకరించగలిగింది.  బీజేపీకి మొత్తం రూ.2,243 కోట్ల డొనేషన్లు రాగా, వీటిలో రూ. 2,064.58 కోట్లు కార్పొరేట్/వ్యాపార రంగాల నుంచే సమకూరడం గమనార్హం. కాంగ్రెస్‌కు మొత్తం రూ.281.48 కోట్ల విరాళాలు రాగా, వాటిలో  రూ.190.3263 కోట్లు కార్పొరేట్/వ్యాపార రంగాల నుంచే వచ్చాయి. అంటే ఈ రెండు పార్టీలకు కార్పొరేట్ కంపెనీలే ప్రధాన ఆర్థిక వనరులుగా ఉన్నాయి. 2022-23లో కాంగ్రెస్‌కు రూ.79.924 కోట్ల విరాళాలు రాగా, 2023-24లో రూ.281.48 కోట్ల డొనేషన్లు వచ్చాయి. అంటే హస్తం పార్టీ విరాళాలు 252.18 శాతం మేర పెరిగాయి.

Also Read :Mary Kom Divorce: మేరీ కోమ్ విడాకులు.. మరో వ్యక్తితో లవ్.. ఎందుకు ?

ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్.. కింగ్ మేకర్ 

ప్రాచీన భారత రాజకీయాలను మనం పరిశీలిస్తే చాణక్యుడు కింగ్ మేకర్(Prudent Electoral Trust).. చంద్రగుప్త మౌర్యుడు కింగ్. ఇప్పుడు ఎలక్టోరల్ ట్రస్టులు కింగ్ మేకర్ తరహా పాత్రను పోషిస్తున్నాయని రాజకీయ పండితులు అంటున్నారు. ఈ విభాగంలో మన దేశంలోనే నంబర్ 1 స్థానంలో ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ ఉంది. 2023-24లో ఈ ట్రస్ట్ బీజేపీ, కాంగ్రెస్‌లకు కలిపి రూ. 880 కోట్ల విరాళాలు ఇచ్చింది. దీన్నిబట్టి ఈ ట్రస్టులో ఎంత పెద్ద కంపెనీలు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ట్రస్ట్ బీజేపీకి రూ.723.675 కోట్లు, కాంగ్రెస్‌కు రూ.156.4025 కోట్లు విరాళంగా ఇచ్చింది. కాంగ్రెస్ మొత్తం విరాళాల్లో సగం ఈ ట్రస్టు నుంచి అందినవే.

Also Read :Hajj 2025 : భారత్, పాక్, బంగ్లా‌లకు సౌదీ షాక్.. అమల్లోకి వీసా బ్యాన్

ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్.. ఎవరిది ? 

  • ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ పాతదే. ఇది చాలా దశాబ్దాలుగా ఉనికిలో ఉంది.
  • ఈ ట్రస్టు పాత పేరు.. సత్య ఎలక్టోరల్ ట్రస్ట్.
  • ఇందులోని మెజారిటీ కంపెనీలు భారతీ ఎయిర్ టెల్ గ్రూపువే.
  • ప్రతీసారి ఎన్నికల సమయంలో ఈ ట్రస్టు నుంచి భారత్‌లోని అన్ని ప్రధాన జాతీయ పార్టీలకు విరాళాలు అందుతుంటాయి.
  • అధికారంలో ఉన్న పార్టీకి అత్యధిక విరాళాలను అందించడం అనేది సర్వసాధారణం. 2023-2024లోనూ అదే జరిగింది. పైన మీరు లెక్కలు చూడొచ్చు.
  • ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్‌లో భారతీ ఎయిర్ టెల్, ప్రముఖ గేమింగ్ కంపెనీ ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్, హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇన్‌ఫ్రా, ఫిలిప్స్ కార్బన్ బ్లాక్, ఇండియా సిమెంట్స్, ఎల్‌అండ్‌టీ, ఎంఆర్‌ఎఫ్, ఎమ్మార్, వాల్ మార్ట్, ఎంఫసిస్, టైమ్స్ మీడియా, కిశోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ రీటైల్‌లు ఉన్నాయి.
  Last Updated: 07 Apr 2025, 05:33 PM IST