వయనాడ్ (Wayanad ) ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) పోటీ చేసేందుకు సిద్ధం అవుతుందా..? అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. 2019 నుంచి కాంగ్రెస్‌లో ప్రియాంక క్రియాశీలకంగా ఉంటున్నప్పటికీ.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు. కొన్నేళ్ల క్రితం జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారని వార్తలు వినిపించాయి. కానీ అలా జరగలేదు. ఇక 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆమె కచ్చితంగా పోటీ చేస్తారని కాంగ్రెస్ శ్రేణులు కూడా భావించారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక పోటీ చేయాలని, తన మనసులో మాట కూడా బయటపెట్టారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే. కానీ ప్రియాంక గాంధీ పోటీ చేయలేదు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రెండు సీట్లల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. అవి.. తల్లి సోనియా గాంధీకి చెందిన రాయ్‌బరేలీ, 2019లో తాను గెలిచిన కేరళ వయనాడ్ సీటు. ఈసారి.. ఆయన ఆ రెండు సీట్లల్లోనూ విజయం సాధించారు. రాజ్యాంగం ప్రకారం.. ఆ రెండింట్లో ఒకటి ఒదులుకోక తప్పదు. వయనాడ్, రాయ్‌బరేలీల్లో రాహుల్ గాంధీ ఏ సీటు వదులుకుంటారు? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాలు చెపుతున్న దాని ప్రకారం.. రాహుల్ వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గానికి రాజీనామా చేస్తారని రాయ్‌బరేలీ నుంచి ఎంపీగా కొనసాగుతారని సమాచారం. రాహుల్ వయనాడ్ నుండి వైదొలిగితే, వయనాడ్ స్థానం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం. వయనాడ్ నుండి పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తుందని అంత భావిస్తున్నారు.
Read Also : NTR Bharosa: వైఎస్సార్ పెన్షన్ కానుక పేరును ఎన్టీఆర్ భరోసాగా మార్పు