Priyanka Gandhi : మనీలాండరింగ్ కేసులో ప్రియాంక గాంధీ పేరు

  • Written By:
  • Publish Date - December 28, 2023 / 04:33 PM IST

మరోసారి ఈడీ (ED) కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. దేశంలో ఎన్నికలు వస్తున్నాయంటే చాలు..ప్రతిపక్ష పార్టీల నేతల తాలూకా కేసులను బయటకు తీసి..వారిపై ఛార్జ్ షీట్ నమోదు చేస్తుంటారు. తాజాగా త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈడీ తమ పనిని మెదలుపెట్టింది. గత కొంతకాలంగా గాంధీ కుటుంబ సభ్యులపై ఈడీ కేసుల పరంపర కొనసాగిస్తోంది. ఎన్నారై వ్యాపారవేత్త సీసీ థంపీపై గతంలో నమోదు చేసిన మనీలాండరింగ్ కేసు (Money Laundering Probe)లో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) పేరును ఈరోజు తొలిసారిగా ఈడీ చేర్చింది. గతంలో ఆమె భర్త రాబర్ట్ వాద్రా (Robert Vadra) పేరును ఈ కేసులో చేర్చిన ఈడీ.. ఇప్పుడు ప్రియాంక పేరును కేసులో ప్రస్తావించింది.

We’re now on WhatsApp. Click to Join.

రాబర్ట్ వాద్రా 2006లో ఫరీదాబాద్‌లోని అమీన్‌పూర్‌లో రియల్ ఎస్టేట్ ఏజెంట్ హెచ్ఎల్ పహ్వా ద్వారా 40 ఎకరాల భూమిని కొనుగోలు చేసి 2010లో తిరిగి ఆయనకే దానిని విక్రయించారు. అలాగే, అదే ఏడాది అదే గ్రామంలో ఓ ఇంటిని కొనుగోలు చేసి 2010లో తిరిగి దానిని పహ్వాకే అమ్మేశారు. ఈ భూముల క్రయవిక్రయాలు ఆర్థిక అవకతవకలు చోటుచేసుకున్నాయని, అవసరమైన నిధులు థంపి, సుమిత్ చద్దా ద్వార వచ్చినట్టు ఈడీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే చార్జ్‌షీట్‌లో వారి పేర్లు చేర్చింది. ఈ కేసులో పరారీలో ఉన్న ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీతో పాటు థంపీ, బ్రిటీష్ జాతీయుడు సుమిత్ చద్దా కూడా నిందితులుగా ఉన్నారు. ఈ కేసు దర్యాప్తు సమయంలో సీసీ థంపి, రాబర్ట్ వాద్రా మధ్య సుదీర్ఘమైన, బలమైన సంబంధాలు ఉన్నట్లు కనుగొన్నట్లు ఈడీ ప్రకటనలో తెలిపింది. వారి మధ్య వ్యక్తిగత, స్నేహపూర్వక బంధమే కాకుండా సాధారణ, ఒకే విధమైన వ్యాపార ఆసక్తులు కూడా ఉన్నాట్లు వెల్లడించింది.

Read Also : Vijayakanth Dies : విజయకాంత్ మరణ వార్త విని..తట్టుకోలేకపోయిన విశాల్